Ponnala criticizes false hopes given by leaders

Ponnala criticizes false hopes given by leaders, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Ponnala criticizes false hopes given by leaders

అరచేతిలో స్వర్గం చూపిస్తే నమ్మరెవరూ!

Posted: 04/10/2014 11:07 AM IST
Ponnala criticizes false hopes given by leaders

"అరచేతిలో స్వర్గం చూపిస్తే ప్రజలు నమ్మరు!"  ఈ మాటలను అన్నది వేరెవరో కాదు తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. 

ఇతర పార్టీలు ఉపయోగించినట్లుగా చెయ్యి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చేతి గుర్తు కాదు.  నిజంగా చెయ్యే.  అరచేతిలో వైకుంఠం, అరచేతిలో స్వర్గం అనే మాటలను లేనివి ఉన్నట్టుగా చూపించే డొల్ల మాటలు, తీర్చలేని వాగ్దానాలుగా వాడుతుంటారు.  రావణునికి రంగు మారిస్తే రాముడవుతాడా అని కూడా పొన్నాల ప్రశ్నించారు.  కాంగ్రేసేతర పార్టీలు తెలంగాణా ప్రజలకు చూపిస్తున్న రంగుల కలల ప్రపంచాన్ని పొన్నాల విమర్శించారు. 

అవన్నీ ఒట్టి మాటలేనన్న ఉద్దేశ్యంతో వ్యాఖ్యానించిన పొన్నాల, తమ పార్టీ విషయంలో అభ్యర్థుల విషయంలో మహిళలు మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చి చూపించామని అన్నారాయన.  దానితోపాటే, ఇప్పుడు అవకాశం రానివారికి భవిష్యత్తులో అవకాశం తప్పక కల్పించటం జరుగుతుందని కూడా పొన్నాల హామీ ఇచ్చారు. 

సిపిఐ తో ఉన్న పొత్తు వలన టికెట్ లభించని కొందరు కాంగ్రెస్ రెబల్స్ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చెయ్యటానికి సిద్ధమై నామినేషన్లు వేసారు.  అయితే రాజకీయ లబ్ధి కోసమే ఎన్నకలలోకి వచ్చినవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.  కానీ దానితోపాటే ఆ రెబల్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారన్న విశ్వాసాన్ని కూడా ఆయన ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles