Noose tightened to sabita indrareddy

noose tightened to Sabita Indrareddy, Former Home Minister Sabita Indra Reddy, Sri Lakshmi IAs, Krupanandam IPS, Obulapuram Mining Corporation

noose tightened to Sabita Indrareddy

సబిత చుట్టూ మరింత బిగిసిన ఉచ్చు

Posted: 04/09/2014 09:53 AM IST
Noose tightened to sabita indrareddy

మాజీ రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంత వరకు ఓబుళాపురం తవ్వకాలలో జరిగిన అవకతవకలలో కేవలం సాక్షిగా ఉండేవారు.  అయితే ఈ కేసులో దర్యాప్తును ఒక కొలిక్కి తీసుకువచ్చిన సిబిఐ సబిత ను ఇప్పుడు సాక్షి హోదా నుంచి నిందితురాలి హోదాకు మార్చటం విశేషం.   ఇప్పటికే జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు.  ఒకసారి మీడియా ముందు తనేమీ తప్పు చెయ్యలేదని, కళంకిత మంత్రి అని తనని వ్యవహరించవద్దని కోరారామె. 

సబిత ఇంద్రారెడ్డి మీద ఇప్పటికి 120 బి రెడ్ విత్ సెక్షన్ 420, 427, 468, 447, 409 లే కాకుండా అవినీతి నిరోధక చట్టం కింది సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(డి) కింద సిబిఐ అభియోగాలు చేస్తోంది. 

ఓబుళాపురం మైనింగ్ కేసులో 2007 లో జివో నంబర్ 151, 152 జారీ అవటం, 2004 నుంచి 2009 వరకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గనుల శాఖకు కార్యదర్శిగా పనిచెయ్యటం జరగటంతో మైనింగ్ లీజులలో అవకతవకలు జరిగాయన్న అభియోగం మీద ఆమె మీద సిబిఐ నిందితురాలిగా కేసు పెట్టి దర్యాప్తు సాగిస్తూ, ఆమె బెయిల్ కి కూడా అడ్డుపడుతూ వచ్చింది.  కోర్టులో శ్రీలక్ష్మి సబితా ఇంద్రా రెడ్డి పేరు పెట్టి ఆరోపిస్తూ, మంత్రికి తెలియకుండానే పనులు జరుగుతాయా, ఆమెనెందుకు వదిలిపెడుతున్నారంటూ ప్రశ్నించారు. 

వీళ్ళిద్దరే కాకుండా గనుల శాఖలో అంతకు ముందు కార్యదర్శిగా పనిచేసిన కృపానందం కూడా మరో నిందితుడిగా సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొనబోతున్నారు.  సబిత మీద మోపిన నేరాలనన్నిటినీ ఆయన మీద కూడా మోపుతున్నారని సమాచారం.  ఎందుకంటే ఓబుళాపురం లీజ్ ల మీద వ్యవహారం ఆ కాలంలోనే ప్రారంభమైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles