Understanding between chandrababu and venkaiah kcr says

Understanding between Chandrababu and Venkaiah KCR says, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Understanding between Chandrababu and Venkaiah KCR says

చంద్రబాబు వెంకయ్య నాయుడుల మధ్య అవగాహన!

Posted: 04/08/2014 02:23 PM IST
Understanding between chandrababu and venkaiah kcr says

తెదేపా, భాజపా పొత్తు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు మధ్య జరిగిన అవగాహన అని, ఇద్దరూ తెలంగాణాకు వ్యతిరేకులేనని కెసిఆర్ అన్నారు.   అలాగే భాజపా కూడా తెదేపాతో పొత్తు వలనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయంలో వెనకడుగువేసిందని అన్నారు.  

తెరాసను గెలిపిస్తే తెలంగాణా బ్రహ్మాండంగా బాగుపడుతుందని, ఒక పార్టీ ఇంత చెయ్యగలుగుతుందా అని ఆశ్చర్యపడేంత అభివృద్ధిని సాధిస్తామని, తెరాస గెలిపించాలా వద్దా అన్నది మీకే వదిలేస్తున్నామని కెసిఆర్ తెలంగాణా వోటర్లను ఉద్దేశించి అన్నారు.

అయితే తెదేపా భాజపాల ఎన్నికల పొత్తు వలన తెరాస విజయానికి భంగం కలుగుతుందేమో అని భయపడుతున్న కెసిఆర్ ఆ ఒప్పందాన్ని తప్పు పట్టారు.  తెరాస నాయకుడు హరీష్ రావు కూడా ఆ రెండు పార్టీల పొత్తు అనైతికమని అన్నారు.  ఈ  సందర్బంలో గతాన్ని గుర్తు చేస్తూ, గుజరాత్ లో జరిగిన అల్లర్ల వలన చంద్రబాబు నాయుడు ఎన్డీయే తో అనుబంధాన్ని వదులుకున్నారని, 2003 లో గణేష్ నిమజ్జనం సమయంలో పాల్గొనేందుకు మోదీకి అనుమతిని కూడా చంద్రబాబు నిరాకరించారని హరీష్ రావు అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles