All india muslim sangham resolution on modi

Election 2014, All India Muslim Sangham resolution on Modi, Lok Sabha Elections 2014, India General Elections 2014

All India Muslim Sangham resolution on Modi

మోదీ విషయంలో ఆల్ ఇండియా ముస్లిం సంఘం నిర్ణయం

Posted: 04/04/2014 12:42 PM IST
All india muslim sangham resolution on modi

ముస్లిం వోటర్లను సంఘటితపరచి వోట్లు చీలకుండా, మోదీ గెలవకుండా చెయ్యటమే ఎన్నికలలో లక్ష్యంగా ఖాలిద్ రసూల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా ముస్లిం సంఘం సమావేశంలో మతాలకు అతీతంగా పనిచేస్తూ ముందున్న నాయకుడికే వోటు వెయ్యాలన్న నిర్ణయం జరిగింది.  భారతీయ జనతా పార్టీతో సంబంధంలేనంత వరకు ఆ అభ్యర్థి ఏ కులం మతానికి చెందినా పరవాలేదు, ఏ పార్టీకి చెందినవాడైనా పరవాలేదు అని అంగీకరించారు. 

హైద్రాబాద్ లో ముస్లిం వోటర్లు కట్టుగానే వున్నారు కానీ జిల్లాలలో అలా లేదని, అందుకోసం ఇలాంటి సమావేశాలు ఇంకా నిర్వహించవలసి ఉందని భావించారు అందులో వివిధ రంగాల నుంచి వచ్చి పాల్గొన్న ముస్లింలు.  మరో విశేషమైన నిర్ణయం జరిగిందేమిటంటే, వివిధ సంస్థలలా కాకుండా ఒకే పేరుతో తెలంగాణా ముత్తహదా ముస్లిం మహజ్ అనే పేరుతో సంఘటితమౌతే మంచిదని. 

భాజపా వైపు మొగ్గు చూపిస్తున్న తెదేపాను అందుకు ప్రోత్సహించకుండా ఉండటమే పరోక్షంగా ఈ నిర్ణయల ఉద్దేశ్యమని తెలుస్తోంది. 

మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ, ముస్లింలంతా కలిసికట్టుగా ఉంటేనే రాజకీయంగా ఎదగటం కూడా సాధ్యమౌతుందని అన్నారు.  ఎన్నికలలో మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇవ్వటానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని, అందుకు కారణం దాని వలన హిందూ వోట్లకి గండిపడుతుందని వారి ఉద్దేశ్యమని కూడా అన్నారాయన.  అందువలన మనం సంఘటితంగా పనిచేస్తూ డిమాండ్ చేసే పరిస్థితిని నెలకొల్పటం అవసరమని అన్నారు.

ఈ సందర్భంగా, లోగడ రాజశేఖర రెడ్డి మాటలు విని తెలుగు దేశం పార్టీని ఓడించామని, కానీ ఆయన తమకు చేసిందేమీ లేదని, గతంలో చేసిన తప్పుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం కూడా ముఖ్యమేనని అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles