Nagma denies kissing and other incidents in public

Nagma denies kissing and other incidents in public, Actress Nagma contesting from Meerut, Gajaraj Singh kissing denied by Nagma

Nagma denies kissing and other incidents in public

నన్నెవరూ ముద్దు పెట్లే, నేనెవర్నీ కొట్లే- నగ్మా వివరణ

Posted: 04/03/2014 10:08 AM IST
Nagma denies kissing and other incidents in public

మీరట్ నుంచి కాంగ్రెస్ తరఫున లోక్ సభకు పోటీచేస్తున్న సినీ నటి నగ్మా తన మీద మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ, తననెవరూ ముద్దు పెట్టుకోలేదని, తనెవరినీ కొట్టలేదని వివరణనిచ్చారు. 

గజరాజ్ సింగ్ తన చెవిలో ఏదో మాట్లాడటానికి అలా చేత్తో తలని దగ్గరకు తీసుకున్నారట.  మరో సారి వేదిక దగ్గరకు వస్తున్నప్పుడు మూగిన గుంపులో తను బహుశా ఎవరినైనా తొసేసి వుండచ్చేమో కానీ ఎవరి చెంపనూ తాను చెళ్ళుమనిపించలేదని అన్నారు. 

వీడియోలలో కనిపించినదానికి మీడియాలో విపరీత వ్యాఖ్యానాలు చేసారని అన్న నగ్మా మరి గజరాజ్ ముద్దుపెట్టుకోకుండా చెవిలోనే ఏదో ఊదినపుడు తను కోపంగా ఉపన్యాసం ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పలేదు.  అంటే ఉపన్యాసం ఇవ్వకుండా వెళ్ళిపోమని చెప్పారా గజరాజ్ సింగ్ అని ప్రశ్నిస్తున్నారు కొందరు మీడియా ప్రతినిధులు.  జనం గుమికూడిన సందర్బంగా తన మీద కావాలని పడకపోతే, ఆ మనిషిని చెంప మీద కొట్లవలసి రాకపోతే, ఆ తర్వాత మరోసారి ఇలా జరిగితే నేను ఇక మీరట్ కి రాను అని నగ్మా ఎందుకు అన్నారని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. 

ఏది ఏమైనా నగ్మాకి ఆశించినదానికంటే ఎక్కువ కవరేజ్, ఎక్కువ సానుభూతి లభించింది.  అలాగేమీ జరగలేదని అంటూ తాజాగా చేసిన ప్రకటన వలన ఆమె తన పార్టీ పరువుని కాపాడుతున్న పేరును కూడా సంపాదించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles