Congress meeting with imam fruitless says imam s brother

Congress meeting with Imam fruitless says Imam's brother, Shahi Imam Syed Bukhari, Delhi Jama Masjid Imam, Congress party meets Shahi Imam, Imam's brother Yehya Bukhari

Congress meeting with Imam fruitless says Imam's brother

ఇమామ్ తో కాంగ్రెస్ భేటీకి ప్రాధాన్యత లేదు- ఇమామ్ సోదరుడు

Posted: 04/05/2014 08:21 AM IST
Congress meeting with imam fruitless says imam s brother

మత విద్వేషాలు దేశంలో అవినీతి కంటే ప్రమాదకరం అన్నారు షాహీ ఇమామ్. 

ఢిల్లీ జామా మస్జీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి సోనియా గాంధీతో చర్చలు ముగిసిన తర్వాత, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో అతి పెద్దదిగా భావిస్తున్న అవినీతి కుంభకోణాలకంటే మత విద్వేషాలు మరింత విషమయమని అన్నారు.  వినటానికి చాలా బావుంది కానీ ఆయన మాటలను ఎవరూ లెక్కచెయ్యరంటున్నారు చాలామంది దగ్గరివాళ్ళే!  ఆయన లోగడ సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ప్రకటించారు, భాజపాకి కూడా వత్తాసు పలికారు. 

అయితే 2009 లో మైనారిటీ కమ్యూనిటీని అణగదొక్కుతోందంటూ షాహీ ఇమామ్ బహిరంగంగా కాంగ్రెస్ ని విమర్శించారు.  అయినా ముస్లిం వోటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన మురాదాబాద్, ఫర్రూఖాబాద్ లాంటి స్థానాలలోంచి 22 పార్లమెంటరీ సీట్లను సంపాదించుకుంది.  అంటే షాహీ ఇమామ్ మాటను ముస్లిం వోటర్లు లెక్కచెయ్యరని తెలుస్తోంది.  అంతేకాదు 2004 లో బుఖారీ భాజపా కి తన సమర్థతను ప్రకటించగా ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైపోయింది. 

షాహీ ఇమామ్ కి ముస్లిం వోటర్ల మీద నియంత్రణ లేదనే అధికశాతం అభిప్రాయపడుతున్నారు.  అందులో స్వయానా ఆయన సోదరుడు యేహ్యా భుఖారీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇమామ్ ల మధ్య భేటీ కి ఎటువంటి ప్రాధాన్యతా లేదని, ఆయన మాటలు వోటర్లు వినే పరిస్థితిలో లేరని అన్నారు. 

అయినా ఎన్నికలు రాగానే ఆయన వలన ఎటువంటి లాభం చేకూరకపోయినా, ఆయనతో సంప్రదింపులు జరపటం రాజకీయ పార్టీలకు మామూలైపోయిందని విమర్శకులు అంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles