Mohan babu son satires on chiranjeevi

Chiranjeevi, minister chiranjeevi, congress party, mohan babu, mohan babu son manoj, Mohan babu son satires on Chiranjeevi, Mohan babu son tweets on Chiranjeevi, manoj comment on chiranjeevi, manchu family vs mega family, ap bifurcation, seemandhra people, seemandhra leaders, cm post, chiranjeevi cm.

Mohan babu son satires on Chiranjeevi, Mohan babu son tweets on Chiranjeevi

చిరంజీవి పై మోహన్ బాబు కొడుకు కామంట్ ?

Posted: 02/26/2014 11:26 AM IST
Mohan babu son satires on chiranjeevi

గతంలో  చిరంజీవి, మోహన్ బాబు మద్య మాటల యుద్దం జరిగిందే. ఒకరి ఒకరు  పరోక్షంగా  విమర్శలు చేసుకున్న సంఘటన్లు చాలా ఉన్నాయి.  చిరంజీవి కంటే ..ముందుగానే  మోహన్ బాబు  రాజకీయ ప్రవేశం చేసినప్పటికి  పెద్దగా ఫలితం లేకుండా పోయింది.  

మోహన్ బాబుకు రాజకీయ  జీవితం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి.  చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసిన  అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్లటం జరిగింది.  ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ లోని  కొంత మంది పెద్దలకు మింగుడుపడటం లేదని  విమర్శలు టాలీవుడ్  లో వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ నుండి   రాజకీయల్లోకి ప్రవేశించిన  సినీ తారలు.. ఊర్వశి  శారద. కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు,  బాబు మోహన్, దాసరి నారాయణ రావు,  క్రిష్ణం రాజు, ఇంక చాలా మంది ఉన్నారు. కానీ  వీరు రాజకీయంగా పదవిని అనుభవించారు గానీ,  రాజకీయంగా ఎదగలేకపోయారనేది  జగమేరిగిన సత్యం.  టాలీవుడ్ నుండి అతి తక్కువ సమయంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గరగా వెళ్లిన  వ్యక్తి  చిరంజీవి ఒక్కడే. 

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయల్లో  కేంద్ర మంత్రి చిరంజీవి పేరు బాగా వినిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాడ్    చిరంజీవిని ఒక నాయకుడిగా గుర్తించి, రాష్ట్ర  బాద్యతలను  అప్పగించేందుకు సిద్దంగా ఉన్నట్లు  మీడియా వార్తలు వస్తున్నాయి.  ఇలాంటి సమయంలో  టాలీవుడ్  నుండి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. 

మంచు మోహన్ బాబు  తనయుడు  మంచు మనోజ్  కేంద్ర మంత్రి  చిరంజీవి పై కామెంట్ చేసినట్లు  టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పై సీమాంద్ర ప్రజలు  మండిపడుతున్న సమయంలో, సీమాంద్ర ప్రాంతం నుంచి  ఎన్నికైన  చిరంజీవి  ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూడటం పై   సీమాంద్ర ప్రజలు  తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 సీమాంద్ర  ప్రజల తరుపున  పోరాటం  చెయ్యల్సిన  సీమాంద్ర నాయకులే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పదవుల కోసం ఎదురుచూడటం  ఆశ్చర్యంగా ఉందని మంచు మనోజ్ బాబు  కామెంట్ చేసినట్లు  టాలీవుడ్  సమాచరం. 

ఇప్పుడు  తనని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అందుకోసం రెడీ అన్నట్టు ఎదురు చూస్తున్నారు. అన్నయ్య (చిరంజీవి) తీరు పట్ల వీరాభిమానులే విసిగిపోతుంటే ఇక సగటు మనిషి ఎలా స్పందిస్తాడో చెప్పక్కర్లేదు. చిరంజీవి నిజంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే మాత్రం ఇంతకాలం ఎదుర్కొన్న విమర్శలకి ఎన్నో రెట్లు ఘోరమైన సెటైర్స్‌ చవిచూడాల్సి  వస్తుందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.

ఇదిలావుంటే మంచు మనోజ్‌ ట్విట్టర్‌లో 'ప్రజలు రిజెక్ట్‌ చేసినా టాప్‌ పొలిటీషియన్‌ కావడం ఎలా? ఒక వ్యక్తి సెంటర్‌లో కూర్చుని మన ప్రజలతో ఆడుతున్న గేమ్‌ని మనం టీవీలో చూస్తున్నట్టు చూస్తున్నాం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం' అంటూ ట్వీట్స్‌ చేయటం జరిగింది.  

ఈ ట్వీట్స్  చదివిన  ప్రతి ఒక్కరికి  ఇది కేంద్ర మంత్రి   చిరంజీవి పైనే కామెంట్ వేశారని అర్థమువుతుందని ట్విట్టర్  అభిమానులు అంటున్నారు. అయితే  ఈవిషయం తెలుసుకున్న  మెగా అభిమానులు  మంచు మనోజ్ బాబు పై  విరుచుకుపడుతున్నారు. 

మంచు మనోజ్ కామెంట్ పై .. మెగా ఫ్యామిలీ నుండి ఎవరు  కౌంటర్ ఇస్తారో చూడాలని ..నెట్ అభిమానులు  ఆశగా ఎదురు చూస్తున్నారు. మెగా వర్సెస్  మంచు ఫ్యామిలీల వార్ ఎటువైపు వెళుతుందో చూద్దాం. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles