Jaya lalitha releases election manifesto

Jaya Lalitha releases election manifesto, Jaya Lalitha wants PM seat, Jaya Lalitha promises in manifesto, Tamil Nadu Chief Minister Jaya Lalitha, 45 pages of Jaya Lalitha elction Manifesto

Jaya Lalitha releases election manifesto

ప్రధాన మంత్రి అవాలన్న జయలలిత చిరకాల వాంఛ

Posted: 02/25/2014 04:39 PM IST
Jaya lalitha releases election manifesto

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జాతీయ స్థాయిలో అత్యున్నత పదవికి ఆశపడుతున్నానంటూ తన మనసులోని మాటను తన ఎన్నికల మానిఫెస్టోలో బహిర్గతం చెయ్యకనే చేసారు. 

వచ్చే లోక్ సభ ఎన్నికలలకు తమిళనాడు పుదుచ్చేరి లోని 40 స్థానాలలోను అభ్యర్థులను ఖరారు చేసిన జయలలిత ఎన్నికల తీర్మానంలో అన్ని వర్గాల వారికీ నచ్చేవిధంగా ప్రకటన చేసారు.  అందులో, సంకేతాత్మకంగా చెప్తూ తనేగనక ప్రధానమంత్రైతే, దేశవాసులకు ఏం చెయ్యగలరో, దేశానికి ఏమేం ప్రయోజనాలను కలిగించగలరో ప్రకటించారు.  బీద ధనిక, విద్యావంతులు విద్యలేనివారు, గ్రామీణ నగరవాసులు, ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించే విధంగా జయలలిత తన మానిఫెస్టోలో వాగ్దానాలు చేసారు. 

తమిళం, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేసిన 45 పేజీల ఆ మానిఫెస్టోలో తమిళనాడు, భారతదేశం యావత్తూ అభివృద్ధి పథంలో నడిచే విధంగా తాను తీసుకోబోయే నిర్ణయాలను ఉటంకించారు. 

ప్రముఖంగా ఆదాయ పన్నును 5 లక్షలకు పెంచుతానని వాగ్దానం చేసిన జయలలిత విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తెప్పించి నేరస్తులను కఠినంగా శిక్షిస్తానని మానిఫెస్టోలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నవారు కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ, భాజపా ప్రకటిత అభ్యర్థి నరేంద్ర మోదీ లతో పాటు జయలలితతో కూడా తనంతట తానుగా తన అభిలాషను తెలియజేసారు.  ఇక అన్నా హజారే మద్దతుని కొనసాగించినట్లయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బరిలోకి రావొచ్చు.  దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడ్డందుకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేకపోయినా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాన మంత్ర పదవి కోసం తను కన్న కలలు ఇంకా చెరగిపోలేదన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles