Sonia gandi will throw stone to decide seemandhra capital

Sonia gandi, congress party, JC Diwakar Reddy, Seemandhra capital, cm post, andhra pradesh bifurcation, Seemandhra capital updates, Seemandhra new capital.

Sonia gandi will throw stone to decide Seemandhra capital

అమ్మ విసిరే రాయి కోసం ఎదురుచూస్తున్న సీ-నేతలు?

Posted: 02/26/2014 01:38 PM IST
Sonia gandi will throw stone to decide seemandhra capital

అవును .. మీరు చదింది కరెక్టే. ఆ రాయి ఎక్కడ పడితే ..అక్కడే  సీమాంద్ర రాజధాని అని కాంగ్రెస్ నాయకులే కామెంట్ చేస్తున్నారు. అయితే  ఈ కామెంట్  మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి చేయటమే ఆశ్చర్యం. ఆయన మొదటి నుంచి  రాష్ట్ర విడిపోతుందని,  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటానికి సిద్దపడిందని,   మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంద్ర ప్రజలను మోసం చేస్తున్నాడని మీడియా ముందు  గోల చేసిన ఎవరు పట్టించుకోలేదు. 

రాష్ట్ర విభజన అనేది జరిగింది. ఇక మిగిలింది సీమాంద్ర ప్రాంతంలో  రాజధాని ఎక్కడ?  ఇప్పుడు  సీఎం ఎవరు? అనే రెండు రాళ్లు కాంగ్రెస్ పార్టీ  అధినేత్రి  సోనియాగాంధీ వద్ద ఉన్నాయని  మన జేసి దీవాకర్  రెడ్డి అంటున్నారు.   సోనియా గాంధీ  ఆ రెండు రాళ్లును ఎప్పుడు విసిరితే  అప్పుడు అవి ఎక్కడ (ఎవరిమీద) పడితే.. వారే  రాష్ట్రాని ముఖ్యమంత్రి,  ఆ రాయి పడిన చోటే  సీమాంద్ర ప్రజలకు రాజధాని జేసి దీవాకర్ రెడ్డి జ్యోసం చెప్పారు. 

ఇప్పుడు  సీమాంద్ర నేతలు,  సీమాంద్ర  ప్రజలు అమ్మ రాయి కోసం  ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ..రాష్ట్ర ముఖ్యమంత్రి  పదవి కోసం కొంత మంది పేర్లు సూచించారు. అలాగే.. సీమాంద్రలో  రాజదాని కోసం  కొన్ని ప్రాంతాలను  కాంగ్రెస్ హైకమాండ్  సూచించింది.  ఇక మిగిలింది .. అమ్మ సమయం చూసుకోని . ఆ రెండు రాళ్లు  విసరటమే ఆలస్యం అని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

కాంగ్రెస్ హైకమాండ్  ముందుగా..  సీఎం  పదవి రాయిని  విసరటానికి  సిద్దంగా ఉన్నట్లు  మీడియా లో  వార్తలు వస్తున్నాయి.  అదీ  కూడా సీమాంద్ర ప్రాంతానికి చెందిన  నేతలనే  ..ఆంద్రప్రదేశ్  కు   చివరి సీఎం ను చేయాలనేది    కాంగ్రెస్  హైకమాండ్ కోరిక. అందుకే.. కేంద్రం మంత్రి  చిరంజీవి,  మంత్రి కన్నా, మంత్రి ఆనాం,   పీసీసీ ఛీప్  బొత్స  పేర్లు కాంగ్రె స్ పార్టీ  సీనియర్  నాయకుల మద్య  బలంగా వినిపిస్తున్నాయి. 

మొదటి రాయి విసిరిన వెంటనే.. రెండు రాయి కూడా  సీమాంద్ర  ప్రాంతం పై విసరటాని సోనియాగాంధీ  సిద్దంగా ఉన్నట్లు  కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.   అమ్మ రాజధాని  రాయి విసిరితే.. అక్కడ బిజీనెస్ చేసుకోవటానికి  సీమాంద్ర నేతలు  ఆశగా ఎదురుచూస్తున్నారు.  అమ్మా  విసిరే  రాజధాని రాయి , గుంటూరు,  విజయవాడ,  దొనకొండ,  ఒంగోలు,  తిరుపతి , వైజాక్ , కర్నూల్, ప్రాంతాల్లో  ఎక్కడ పడుతుందోనని..  రాజకీయ నాయకులు  ఉత్కంఠ గా  ఎదురు చూస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles