Amala to contest from bejawada lok sabha

Akkineni Amala join bjp, Amala contest from bejawada, lok sabha, 2014 elections, bejawada lok sabha, congress party, TDP, BJP

BJP is trying to rope Akkineni Amala from Vijayawada Lok Sabha. Two senior leaders of BJP are in touch with Akkineni family and waiting for her approval.

బెజవాడ నుండి లోక్ సభకు అమల

Posted: 02/04/2014 03:37 PM IST
Amala to contest from bejawada lok sabha

ఒకప్పటి నటి, ప్రస్తుత సమాజ సేవకురాలు అయిన నాగార్జున భార్య కూడా రాజకీయాల్లోకి రాబోతుందా ? ఆమె రాజకీయాల్లోకి వచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అవుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ రాజకీయ వర్గాలు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు కూడా సినీ గ్లామర్ ని సాద్యమైనంతగా అద్దటానికి ప్రయత్నిస్తున్నాయి.ముఖ్యంగా బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి రేసులో ఉండటంతో కేంద్రంలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నటుల్ని పార్టీలోకి గాలం వేసి లాగే ప్రయత్నాలు చేస్తుంది.

అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇప్పటికే తమ పార్టీ పాత అభ్యర్థి క్రిష్ణం రాజును పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు నాగార్జున భార్య అయిన అమలను పార్టీలోకి తీసుకొని బెజవాడ నుండి లోక్ సభ పోటీలో నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణ , సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో సీమాంధ్రలో ఇన్ని రోజులు బలంగా కనిపించిన జగన్ పార్టీ ఇప్పుడు చతికల పడే సూచనలు కనిపిస్తుండటంతో దాన్ని ఓట్లు మలచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఈమెను పార్టీలోకి తీసుకొని విజయవాడ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయించాలని, కాంగ్రెసు పార్టీ కి కంచుకోట అయిన విజయవాడలో  లగడపాటి రాజగోపాల్‌ను ఓడించాలని చూడటమే కాకుండా, తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న కేశినేని నాని లాంటి వాళ్ళకు పోటీగా అదే సామాజికక వర్గానికి చెందిన అమలను పోటీకి దింపడం ద్వారా నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతుందని భావిస్తున్నారు. వైయస్ ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉండే నాగార్జున ఇప్పుడు బీజేపీలో చేరుతారా లేదా అన్నది కూడా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles