Dk aruna fires on cm kiran behaviour

cm kiran silent dharna, minister dk aruna, samaikyandhra dharna, cm kiran dharna in delhi, congress party, Telangana bill, Tbill, 2014 election, parliament news, cm vs dk aruna, telangana leaders,

Dk Aruna fires on CM Kiran behaviour, CM kiran Silent Dharna

తిరగబడిన మంత్రి డికె. అరుణ?

Posted: 02/06/2014 11:37 AM IST
Dk aruna fires on cm kiran behaviour

నిన్నటి వరకు  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి అతి సన్నిహితురాలుగా ఉంటూ.. తెలంగాణ లీడర్ గా పేరు తెచ్చుకున్న  రాష్ట్ర మంత్రి డికె. అరుణ .. ఒక్కసారిగా  ఎదురుతిరిగింది.  నిన్న ఢిల్లీలో  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో .. సమైక్యంద్ర కోసం మౌన దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నల్లారి నోటి నుండి  సడన్ గా..  జై సమైక్యంద్ర అంటూ..  నినాదం చేయటంతో..  అక్కడ రాజకీయ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..  జై సమైక్యంద్ర అనటంతో.. అక్కడే.. ఉన్న తెలంగాణ మంత్రులకు  గుండె జారిపోయినట్లు అయింది.  

అయితే  వెంటనే.. అక్కడే ఉన్న మంత్రి గీతా  రెడ్డి,  సునీతా లక్ష్మారెడ్డి, డి.కె. అరుణ..  జై తెలంగాణ .. జై .జై తెలంగాణ అంటూ.. నినాదాలు చేయటంతో..  ఢిల్లీ పోలీసులకు ఏం జరుగుతుందో  తెలియక..  అక్కడి వారిని  చెదరగొట్టే పనిలో పడ్డారు. ఈ సందర్బంలో.. గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కిందపడిపోవటంతో..  డి.కె. అరుణ లో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. దీంతో.. డికె. అరుణ.. సిఎం కిరణ్ ఎక్కిన బస్సు ముందు నిలబడి.. జై తెలంగాణ... అంటూ  నినాదాలు చేస్తూ..  సీమాంద్ర నేతల పై  మండిపడ్డారు. సీఎంకు.. సీమాంద్ర నాయకులకు సిగ్గులేదని శాపనార్థలు పెట్టారు.  అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. నిన్న ఢిల్లీలో  రచ్చ రచ్చ చేసింది కాంగ్రెస్ నాయకులే కావటం విశేషం.  ప్రతిపక్షపార్టీ నాయకులు .. మాత్రం  పాత వేషాలు వేసి పరువు పొగొట్టుకున్నారు. కానీ  కాంగ్రెస్ నాయకులు  మాత్రం రెండు ప్రాంతాల వారిగా విడిపోయి , ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.   

తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది.. కాంగ్రెస్ పార్టే,   రొడ్డుమీదకొచ్చి కొట్టుకునేది.. కాంగ్రెస్ పార్టీ నాయకులే కావటం ఆశ్చర్యంగా మారిందని మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే .. అధికార పార్టీ నాయకుడే..  సొంత పార్టీ పై సమరానికి దిగితే..   కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనే  అనుమానం  ప్రతి ఒక్కరికి కలుగుతుంది.  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  కావాలనే.. ఢిల్లీలో.. ఆంద్రప్రదేశ్  నాయకులతే.. వీధి నాటకం ఆడిస్తుందని ..  రాజకీయ మేథావులు అంటున్నారు.   కేవలం  టైం పాస్ కోసమే.. తెలంగాణ రాష్ట్రం  పేరుతో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అష్టచష్మ ఆడుతూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను  మేకలుగా వాడుకుంటుందనే విషయం  ప్రతిఒక్కరికి అర్థమవుతుందని  ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.   

అయిన.. ఢికె. అరుణ.. సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తిరగబడటం చూసిన  .. తెలంగాణ ప్రజలు  ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే..  తెలంగాణ ఆడబిడ్డల పౌరుషం ఏమిటో  ఢిల్లీలో చూపించారు కాబట్టి. కానీ  సీమాంద్ర ప్రజలు మాత్రం .. సమైక్య వీరుడని చెప్పుకుంటున్న  సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  తీరు పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే.. మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి .. నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలే  ఇందుకు నిదర్శనం అని.. సీమాంద్ర సీనియర్ నాయకులు అంటున్నారు.  సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్యాంద్ర కావాలి?  తెలంగాణ నేతలకు.. తెలంగాణ రాష్ట్రం కావాలి? కాంగ్రెస్ పార్టీకి.. రెండు ప్రాంతాల ప్రజల  ఓట్లు కావాలి? అయితే చివరకు ఏం జరుగుతుందో  చూద్దాం.. 

ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles