Abandoned buses as night shelters

Abandoned buses as night shelters, Aam Admi Party, AAP Delhi Government,

Abandoned buses as night shelters

తలదాచుకోవటానికో కదలని బస్సు – ఆప్ ఐడియా

Posted: 01/08/2014 10:52 AM IST
Abandoned buses as night shelters

ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సుల్లో సామాన్యంగా అందరూ కునికిపాట్లు పడుతూనేవుంటారు.  అయితే కదలకుండా కాదు కదలలేని బస్సుల్లో కూడా నిద్ర పోవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ కనిపెట్టింది. 

ఢిల్లీలో చలికాలంలో ఇళ్ళు లేని నిరాశ్రయుల పాట్లు చెప్పనలవి కాదు.  అందువలన అటువంటి నిరుపేదలు తల దాచుకోవటానికి ఆప్ మంచి ఉపాయాన్ని కనిపెట్టింది.  ఉపయోగయోగ్యంగా లేని బస్సులలో ఇళ్ళులేనివారు రాత్రిపూట తలదాచుకునే అవకాశం కల్పిస్తూ వారికి కప్పుకోవటానికి బ్లాంకెట్లు కూడా అందులో సమకూర్చటానికి యోజన చేస్తున్నారు. 

ఎముకలు కొరికే చలి బారి నుండి నిరాశ్రయులను కాపాడటానికి వంద కొత్త షెల్టర్లను ఏర్పాటు చెయ్యబోతున్నామంటూ ఆప్ ముందుగానే ప్రకటించింది.  అయితే మరమ్మతులు చెయ్యటానికి కూడా ఉపయోగపడని బస్సుల బాడీ బాగుంటే చాలు అది చలి నుంచి అభాగ్యులను రక్షిస్తుందని దాన్ని వెంటనే అమలు చేద్దామని ఆప్ ప్రభుత్వం భావించటంతో సామాన్యుడి కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నడుపుతోందన్న భావన ఇంకా అందరిలో పెంపొందటానికి ఆమ్ ఆద్మీ పార్టీ పాటుపడుతోంది. 

కొత్తపార్టీగా ఆవిర్భవించి ఢిల్లీలో రాజకీయాల్లో రికార్డ్ సృష్టించిన ఆప్ మీదనే దేశంలో అందరి దృష్టీ ఉంది కాబట్టి ఇలాంటి యోజనలను కొత్తకొత్తవి తీసుకునివస్తూ ప్రాచుర్యం పొందటం వలన ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలోను, జాతీయ స్థాయిలోనూ కూడా నెగ్గుకురాగలదని తెలుస్తోంది. 

ఏమైనా, రాజకీయాలలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో అన్ని పార్టీలకూ దృష్టికేంద్రమైంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles