Golden taj for auction at surat

Golden taj for auction at Surat, Taj Mahal, Shah Jahan Taj Mahal, Golden Taj kept for auction by NGO

golden taj for auction at surat

వేలంపాటలో తాజ్ మహల్

Posted: 01/05/2014 10:27 AM IST
Golden taj for auction at surat

తన మూడవ భార్య ముంతాజ్ మహల్ మీద తనకుగల ప్రేమకు చిహ్నంగా షాజహాన్ ఆగ్రాలో కట్టించిన తాజ్ మహల్ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.   చలువరాతి కట్టడమైన తాజ్ మహల్ ని చంద్రుని వెలుగులో చూడటానికి సందర్శకులు ఉత్సాహాన్ని చూపిస్తారు.  అయితే అలా చూసినంత మాత్రాన సరిపోదు- దాన్ని ఇంటికి కూడా తీసుకెళ్దామనుకుంటారు అధికశాతం మంది.  ఫొటోలు వీడియోలతో తృప్తిపడక స్థానిక కళాకారులు చేసిన తాజ్ మహల్ నమూనాలను కొనుక్కుని తమ వెంట తీసుకునిపోతారు. 

గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లో బంగారు తాజ్ మహల్ నమూనాను తయారు చేయించిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ దాన్ని వేలంపాటకు పెట్టారు.  ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఈ తాజ్ మహల్ ని ఒకటిన్నర కిలోల బంగారం, 20 కిలోల వెండి, 50 వేల వజ్రాలను ఉపయోగించారు. 

చలువరాతి తాజ్ మహల్ చల్లదనాన్ని ఇస్తూ షాజహాన్ ప్రేమ కధను గుర్తుచేస్తే, ఈ ఖరీదైన తాజ్ మహల్ సొంతం చేసుకున్నవారికి ధనం వలన లభించే సౌభాగ్యం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది.  తళుకులీనే తాజ్ వారి ఇంటికి శోభనిస్తుంది, ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది.

వేలంపాట ద్వారా వచ్చే సొమ్ముని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles