Eetela demands suspension of members disrupting assembly

TRS leader Eetela Rajender, Disruptions in Assembly, Telangana Bill, Loksatta party, Jayaprakash Narayan Loksatta

Eetela demands suspension of members disrupting Assembly

మాటల ఈటెలు

Posted: 01/08/2014 11:51 AM IST
Eetela demands suspension of members disrupting assembly

చర్చకు అడ్డుపడేవాళ్ళని సస్పెండ్ చెయ్యాలంటూ తెరాస సీనియర్ నాయకుడు కోరారు.

అయితే రాష్ట్ర పునర్విభజన బిల్లు వచ్చిన దగ్గర్నుంచీ శాసనసభలో అన్ని ప్రాంతాల సభ్యులూ అన్ని పార్టీల సభ్యులూ అడ్డుపడుతూనేవున్నారు.  అయితే నౌ రియల్స్ అంటారు ఈటెల రాజేందర్.  

అంతేకాదు బిల్లు మీద తక్షణం చర్చ అంటూ జరగకపోతే బిల్లు పంపిన రాష్ట్రపతిని, భారత రాజ్యాంగాన్ని, బిల్లు ముసాయిదా అందుకున్న శాసన సభనూ కూడా అవమానపరచినట్లే నని అన్నారు ఈటెల.  

ముక్తాయింపుగా లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేరు ఎత్తకుండా, కొందరు సూడో మేధావులు తెలంగాణాకు తెరాసా పార్టీయే అడ్డుపడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చర్చకు వస్తే అందరి రంగులూ బయటపడతాయని ఈటెల అన్నారు.  అదీ అసలు సంగతి.

తెలంగాణా కావాలంటున్న తెరాసా నిజానికి అది కోరుకోవటం లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్న వైకాపా నిజానికి విభజనను కోరుకుంటున్నదని జయప్రకాశ్ నారాయణ మంగళవారం మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.  

తెలంగాణాలో ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తారనేదానికి తెరాసకు స్పష్టత లేదని, కేవలం ఉద్యమంగా ఉన్నంతకాలమే ఆ పార్టీకి మనుగడని, అందుకే తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని ఆ పార్టీ కోరుకోవటం లేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.  దానికి జవాబుగానే తెరాస సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ శాసన సభలో చర్చను అడ్డుకునేవారిని సస్పెండ్ చెయ్యాలని అన్నారు.  కానీ ఇంతకాలం అడ్డుకుంటున్నవారిలో తెరాస సభ్యులు కూడా ఉన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles