Kcr green revolution or tax evasion

kcr green revolution or tax evasion, KCR farmhouse, Telangana agitation, Telangana bill, TRS President KCR

kcr green revolution or tax evasion

ఫాం హౌస్ లో అద్భుతం- తెలంగాణా సుసంపన్నం

Posted: 01/04/2014 03:52 PM IST
Kcr green revolution or tax evasion

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తన ఫాం హౌస్ లోనే ఎక్కువగా గడుపుతారన్న విమర్శలు చేసేవారికిదో పెద్ద ఎదురు దెబ్బ. 

హైద్రాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా మహదేవ్ పూర్ లో కెసిఆర్ 45 ఎకరాల్లో చేసిన సేద్యంలో అన్నీ అద్భుతాలే.

1. నీటి వసతి చాలా తక్కువగా ఉన్న ప్రాంతమది.  ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకున్నారు.

2. బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న 42 లక్షల రూపాయల ఋణాన్ని ఒక్క సంవత్సరంలోనే తీర్చెయ్యగలిగారు.

3. నేలను నమ్ముకున్నవాళ్ళు జీవితంలో ఎంత సాధిస్తారో కెసిఆర్ ని చూసి తెలుసుకోవచ్చు.  ఎకరానికి 20-30 టన్నులకు ఎక్కువగా దిగుబడి రాని టొమాటోని ఇజ్రాయల్ దేశం అవలంబించే విధానంలో ఎకరానికి 200 టన్నుల పండించటానికి పూనుకున్నారాయన. 

4. ఎకరం రెండు ఎకరాలున్న రైతులు కూడా ఏవిధంగా లక్షలు ఆర్జించవచ్చో కెసిఆర్ చూపించారు.  ఆనప, మినప, పసుపు, ఆలుగడ్డలతో మొదలుపెట్టి టొమాటో, బీన్స్, కాప్సికంలను పండించి ఎకరానికి 15 వేల రూపాయల ఖర్చుతో 15 లక్షలు సంపాదించి చూపించారాయన. 

5. ఫాం హౌస్ కాదని ఫార్మర్ హౌసని చెప్పిన కెసిఆర్ ప్రాకృతిక ఎరువులకోసం కంపోస్ట్, వర్షపు నీరు నిల్వచేసుకోవటానికి బావులు ఏర్పాటు చేసారు.  కాకరకాయ ఎకరానికి 70 టన్నలు దిగుబడిని సాధించారాయన.

6. గ్రీన్ హౌజ్ లకు రాయితీలు లభిస్తాయని, దాని ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని తెలియజేసారు.

7. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ కూరగాయలు పండించి అమ్మటం ద్వారా సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తానని కెసిఆర్ అన్నారు.  కాకరకాయ, రంగు కాప్సికమ్ ల ద్వారా ఎక్కువ లాభం గడిస్తున్నానని ఆయన అన్నారు.

కొందరు రాజకీయ నాయకులు కెసిఆర్ ని విమర్శిస్తూ ఆయన తన అవినీతితో కూడబెట్టిన డబ్బుని ఈ విధంగా పన్ను రాయితీగల రాబడి కిందికి మార్చుకుంటున్నారని, వ్యవసాయంతో కుదేలై ఉన్న ఆస్తులను తెగనమ్ముకోవలసిన అగత్యం ఏర్పడుతున్న తరుణంలో అంతంత లాభాలు కలిగటం సాధ్యం కాదని, ఇది కేవలం తన నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవటానికి చేస్తున్న పనని అంటున్నారు.  రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమేలే కానీ, అంతా పన్ను కట్టనవసరంలేని ఆదాయం.  రైతులకు ఆదాయం, చక్కని జీవన శైలి ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఏముంటుంది. 

ఇంతకాలం ఈ విషయాలన్నీ తెలియక వెనకబడివున్న తెలంగాణాకు కెసిఆర్ ని అనుసరిస్తూ వ్యవసాయం మీద దృష్టి పెట్టినట్లయితే మాకు రావలసిన ఉద్యోగాలు, నీళ్లు ఆంధ్రావాళ్ళు కొల్లగొట్టారు కాబట్టి మా తెలంగాణా మాకిచ్చేయండని అనాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.   ఎందుకంటే తక్కువ నీటి వసతితో అధిక లాభాలను గడించి చూపించారు కెసిఆర్.

మొత్తానికి తెలంగాణాలో వ్యవసాయ శకాన్ని ప్రారంభించి హరిత విప్లవంతో తెలంగాణాను సుభిక్షం చెయ్యదలచుకున్న కెసిఆర్ కి ఇక తెలంగాణా ఉద్యమం చెయ్యవలసిన అవసరం లేదేమో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles