Purandeswari and harikrishna to join in bjp

Ntr family joins Bjp, Daggubati purandeswari, nandamuri harikrishna, nandamuri family joining bjp party, venkaiah naidu, Jr Ntr Joins Bjp

Purandeswari and Harikrishna to join in BJP

అన్నా చెల్లెళ్ళు బీజేపీలోకి జంప్ ?

Posted: 01/02/2014 02:43 PM IST
Purandeswari and harikrishna to join in bjp

తెలుగు జాతి ‘అన్నా ’ అని పిలుచుకొనే నందమూరి తారక రామారావు స్థాపించిన ‘తెలుగు దేశం ’ పార్టీని  ఆయన కుమారుడు నందమూరి  హరిక్రిష్ణ వీడబోతున్నారా ? బావ చంద్రబాబు ఆధిపత్య పోరుతో కలత చెందిన ఆయన బీజేపీ పార్టీలోకి చేరబోతున్నాడా ? ఆయనే కాకుండా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి పురేందరీశ్వరీ కూడా కమలం పార్టీలోకి వెళ్ళపోతున్నారా ? అంటే సినీ రాజకీయ రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం అవుననే సమాధానం వినిపిస్తుంది.

తెదేపాలో హరిక్రిష్ణకు చంద్రబాబుకు గత కొంత కాలంగా వైరం కొనసాగుతుంది. ఆ కారణంగానే ఇటీవల జరిగిన ప్రజా గర్జనకు ఆహ్వానించకపోవడం , పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించక పోవడంతో హరిక్రిష్ణ బీజేపీలో చేరడానికి సిద్దం అవుతున్నారని అంటున్నారు. ఇక కేంద్రమంత్రి పురందరీశ్వరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆ పార్టీని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో బలంగా ఉన్న పలువురు నేతలు, కేంద్రమంత్రులు తమ పార్టీలోకి వస్తారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, స్థానిక బిజెపి నాయకులు కూడా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈమెతో పాటు దగ్గబాటి వెంకటేశ్వర రావు కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారట. 2014 ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు స్థానిక బిజెపి తీవ్రంగా కృషి చేస్తోంది. నగరాల్లో ఉన్న మోడీ హవా కూడా అక్కడ వీస్తోంది. దీనికి తోడు తాను విశాఖను వదిలేది లేదని పురంధేశ్వరి ఇటీవల చెప్పారు. అక్కడ ఆమెకు టి సుబ్బిరామి రెడ్డి నుండి కాంగ్రెసు టిక్కెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో కేంద్రమంత్రుల్లో పురంధేశ్వరి బిజెపి వైపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తన తాత స్థాపించిన పార్టీనీ వీడేది లేదని చెప్పుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి బాటలో నడిచి కమలంలోకి వస్తాడా ? లేక తెలుగు దేశం లోనే ఉంటాడా ? అన్నది చూడాలంటున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles