Gandhi word of wisdom

mahatama gandhi, gandhi sukti, words of wisdom

gandhi-word of wisdom

గాంధీ సూక్తులు

Posted: 04/23/2013 03:10 PM IST
Gandhi word of wisdom

బలహీనుడికే క్షమాగుణం ఉండదు. శక్తివంతుడు క్షమించగలుగుతాడు- మహాత్మా గాంధీ.

నిజం చెప్పాలంటే, కోపం వచ్చేది ఎవరికి వారి మీదనే. ఎవరైనా అపవాదు వేసినా, అగౌరవపరచినా అప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చినట్టు అనిపించినా నిజానికి ఎవరికి వారి మీదనే వస్తుంది కోపం. ఎవరైనా పొగిడితే వచ్చే సంతోషం తనమీద తనకి వచ్చే గర్వం వలన. అలాగే ఎవరైనా కించపరిస్తే తన సామర్ధ్యం మీద తనకి నమ్మకం లేకనే.

అందుకే నిజంగా శక్తి కలిగినవాడికి ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువ సేపు ఉండదు.

ఎంత తప్పు చేసాడో తెలుసా నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటుంటారు కొందరు. అది ఎంత మానసిక బలహీనతో చూడండి! మర్చిపోలేను అన్నది గొప్పతనమా? ఒకే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ బాధపడుతుంటాను అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకున్న స్వేచ్ఛ.

ఏమీ చెయ్యలేకపోయాను లేదా ఆ సమయంలో నేను సరిగ్గా బదులివ్వలేదు అని అనుకున్నప్పుడు అది గతించిపోయింది, దాన్ని మార్చలేనిది కాబట్టి గుర్తుకొచ్చినప్పుడల్లా కోపం వస్తుంది. అందుకే సర్వసమర్థుడికి కోపం రాదు.

క్షమించగలగటం మానసికమైన ఎదుగుదల. పెద్దరికం పెత్తనంతోనో, వయసులో పెద్దవటం వలనో రాదు. క్షమించగలిగేవాడే పెద్దవాడు. అటువంటి పెద్ద మనసున్న వ్యక్తి దృష్టిలో తప్పులు చేసేది చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళని క్షమించటం పెద్దవాడిగా తన కర్తవ్యం అనిపిస్తుంది. ఎత్తుకున్న సమయంలో చిన్న పిల్లవాడు కాలితో కొడితే దానికి తప్పు పడతామా? వాడి మీద కక్ష్య పెంచుకుంటామా? అలాగే పెద్దరికం, పెద్ద మనసున్న వారు కూడా క్షమించగలుగుతారు.

పెద్ద అంటేనే శక్తివంతుడని అర్థం వస్తుంది కాబట్టి, శక్తివంతుడే క్షమించగలుగుతారని గాంధీ మహాత్ముడు చెప్పారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more