శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్
ఎంత చక్కని ఆలోచన ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట. తన సృష్టి మీద నిరాశచెందలేదన్నమాట.
జాతంతా భ్రష్టుపట్టింది, మానవ విలువలు పడిపోయాయి అంటూ ఆక్రోశంతో మాట్లాడుతూ మనుషులను నిందిస్తూ చెప్పటం నిరాశావాదమైన ఒక పద్ధతైతే, లేదు, మానవ జాతికి ఇంకా అవకాశం ఉంది, మనం ఇంకా అభివృద్ధి చెందుతాం అని చెప్పటం ఆశావాదం.
జీవితాన్ని పాజిటివ్ తీసుకున్నవారే దాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. వారికి ప్రపంచమంతా అందమైన కలగా కనిపిస్తుంది. అదే, నెగెటివ్ గా తీసుకున్నవారికి అనుమానాలు, ఫిర్యాదులు, కోపావేశాలు, నిరాశా నిస్పృహలు, తనమీద తనకే అయిష్టంతో సంతృప్తి లేకపోవటం జరుగుతుంది. ఈ రెండు విధానాలూ మన ముందే ఉన్నాయి. మనుషులు దేన్ని తీసుకుని అనుసరించాలనుకుంటే దాన్నే తీసుకోవచ్చు. పాజిటివ్ ఆలోచించే స్వాప్నికులకు ప్రపంచంలో దేని మీదా నిరసన ఉండదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more
May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more
May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more
Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు. కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more
Apr 27 | వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుందిప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి, తేడా తెలియకుండా పోయింది. మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని... Read more