Adi shankaracharya quotes

adi shankaracharya quotes, bhakti yoga, karma yoga, gnana yoga, mantra yoga

adi shankaracharya quotes

adi-sankara.png

Posted: 05/01/2013 04:31 PM IST
Adi shankaracharya quotes

ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.

భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు సూచించారు.  అన్నిటికీ లక్ష్యమొక్కటే- ముక్తి చెందటం.  అయితే ఆ మార్గాలలో అత్యుత్తమమైన మార్గం భక్తియోగమని ఆచార్యులు చెప్తున్నారు. 

భక్తి మార్గం ద్వారా భక్తుడు భగవంతుని తెలుసుకోవటం కాదు, ముందు తనను తాను తెలుసుకుంటాడు.  మాయా బంధం లోంచి విముక్తుడవుతాడు.  దానితో సర్వదుఃఖాలు, సర్వబంధాలు, ద్వంద్వాలు సర్వ మోహాలు- అన్నీ నశిస్తాయి.  ఆవరించిన మాయ పొర తొలగిపోయేటప్పటికి సాధకుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు.  తనేమిటో తనకి అర్థమౌతుంది.  దాన్నే ఆత్మజ్ఞానం అన్నారు.  ఆత్మజ్ఞానం బంధ విముక్తులను చేస్తుంది.  అదే ముక్తి చెందటమంటే. 

అలా ముక్తి చెందటానికి అత్యుత్తమమైన మార్గం భక్తిమార్గమంటున్నారు ఆచార్యులు.  అందుకు కారణం, భక్తిలో అర్పణ తప్ప మరేమీ ఉండదు.  అన్నీ అర్పించిన తర్వాత మిగిలేదే స్వస్వరూపం.  కోరికలతో చేసే పూజలను భక్తి మార్గంగా పెద్దలెప్పుడూ పరిగణించలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more

  • Kabir das quotes

    కబీర్ దాస్ సూక్తి

    Apr 27 | వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుందిప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి,  తేడా తెలియకుండా పోయింది.   మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని... Read more