Gandhi word of wisdom

gandhi.png

Posted: 05/03/2013 04:14 PM IST
Gandhi word of wisdom

ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీ

ప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో వర్ణించారు గాంధీ మహాత్మ. 

మన హృదయకవాటాన్ని తెరవటానికి తాళం చెవి ప్రార్ధనే, అలాగే ప్రాపంచక విషయాలనుంచి వెనక్కి వచ్చి విశ్రాంతి తీసుకునే ముందు ఆ కవాటాన్ని మూసివేయటానికి ఉపయోగించే గడియ కూడా ప్రార్ధనే అంటారాయన.

లేవగానే ప్రార్ధనతో దైనందిన జీవితాన్ని ప్రారంభించటం, అలాగే ప్రార్ధనతోనే ఆ రోజుని ముగించటం చెయ్యమని ఆయన ఉద్దేశ్యం.  అప్పుడు రెండు ప్రార్థనల మధ్య కర్మాచరణ, రెండు ప్రార్ధనల మధ్య సుషుప్తి ఉంటాయి.  సుషుప్తి నుంచి కర్మాచరణకు దైవనామ స్మరణతో వెళ్ళమని, అలాగే కర్మాచరణను పూర్తి చేసిన తర్వాత తిరిగి సుషుప్తిలోకి దైవనామ స్మరణతోనే వెళ్ళమని ఆయన సూచిస్తున్నారు. 

అలా చెయ్యటం వలన మనం చేసే కార్యమంతా దైవకార్యమనే భావన కలిగి ఆ పనులన్నీ నిర్మలమైన మనసుతో చెయ్యటం జరుగుతుంది. 

దీన్నే పెద్దలు మరోలా చెప్పారు.  నిద్రలోకి పోయిన తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు.  మన చేతుల్లో లేదు.  జాగృతిలో కూడా ఉండదు కానీ కనీసం మనకు తెలుస్తుంది.  కానీ నిద్రలో మనకు ఏమీ తెలియదు.  అంటే అది కూడా మృత్యువుతో సమానమే.  మనం నిద్రపోయామన్న విషయం కూడా లేచిన తర్వాతనే మనకు తెలుస్తుంది.  అందువలన లేవగానే మనలను పరిరక్షించిన పరమాత్మకు కృతజ్ఞతగానూ, పడుకునే ముందు మనలను రక్షించమని భగవంతుని వేడుకోవటం చెయ్యమని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more

  • Kabir das quotes

    కబీర్ దాస్ సూక్తి

    Apr 27 | వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుందిప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి,  తేడా తెలియకుండా పోయింది.   మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని... Read more