Priyanka 6 crore demands new year show

priyanka chopra, new year event, new year show, rs 6 crore demands, December 31 show,Chennai event show

Bollywood actor Priyanka Chopra demanded for Rs.6 crore to shake a leg December 31 show.

ప్రియాంక రేటు 7 నిమిషాలకు 6 కోట్లు

Posted: 12/17/2013 11:58 AM IST
Priyanka 6 crore demands new year show

వెండితెర పై ఒక్కసారి హీరోయిన్ గా కనిపించి కాస్త ఒంపుసొంపులు చూపించి, ఫిగర్ ఫర్ ఫెక్ట్ అని అనిపించుకొని కాస్తంత పేరు తెచ్చుకుంటే చాలు.. ఏదో విధంగా డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి వారికి. సినిమాల్లో అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న భామలు షాపు ఓపెనింగులు, సైడ్ బిజినెస్ లు చేస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు. అదే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇక వారికి పండడే పండగ.

నూతన సంవత్సర వేడుకులను నిర్వహించే హోటల్స్ వారు వీరిని ఒక్కరాత్రికి లక్షలు పోసి బుక్ చేసుకుంటారు. వారు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓ పైసా ఎక్కువే గుంజుతారు నిర్వహకుల నుండి. అదే స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు. గంటల చొప్పున డిమాండ్ చేస్తున్నారు. ఇక టాప్ హీరోయిన్లు మరో అడుగు ముందుకు వేసి నిమిషాల చొప్పున  వసూలు చేస్తున్నారు.

ఇఫ్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా  కొత్త సంవత్సరం సందర్భంగా చెన్నయ్‌లో జరగనున్న ఓ వేడుకలో కేవలం ఏడే ఏడు నిమిషాలు నర్తించడానికి కమీట్ అయ్యిందట. దీనికోసం ప్రియాంక అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సాధారణంగా వాణిజ్య ప్రకటనల కోసం నటీ నటులు ఇంత డిమాండ్ చేస్తారు.

కానీ ఓ రాత్రి కేవలం ఏడు నిమిషాలు నర్తించినందుకే ప్రియాంక ఇంత వసూలు చేయడం పై మిగతా భామలు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా, ఏడు నిమిషాలకు ఇంత మొత్తం చాలా ఎక్కువని నిర్వాహకులకు కూడా అనిపించినప్పటికీ యువతలో ప్రియాంకకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇవ్వడానికి సిద్ధపడ్డారట. టికెట్స్ ద్వారా ఆ డబ్బుని వసూలు చేసుకోవచ్చనే ధీమాతో ఉన్నారట.

అందుకే ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారట. ఈ నెల 31న జరగబోయే ఈ కార్యక్రమంలో జోరుగా హుషారుగా ఉండే పాటలకు నర్తించడానికి ప్రియాంక రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఆ రోజు ఆ ఏడు నిమిషాల్లో ఏ మాత్రం ప్రియాంక పరువాలన్నీ ఆరబోయ బోతుందోనని ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more