రాయల తెలంగాణ అంటూ కూడా ప్రచారం జరిగినా కేంద్ర పార్టీ మాత్రం తాము పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణకు మాత్రమే అనుకూలమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా పార్లమెంటులో తమ మద్దతు కావాలంటే పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందేనని ఘంటా పథంగా చెప్పారు. అయితే ఆదినుండి విభజనపై జీవోఎంలో ఉన్న మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ జనాన్ని ఆందోళనకు గురిచేసిన విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు పిలుపునిచ్చిందని రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.
మా పార్టీ ఆదినుండి కోరుకున్న విధంగానే కేంద్ర కేబినెట్ పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో తెలంగాణ భాజపా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇక తమ దృష్టంతా సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి కావాల్సినంత ప్యాకేజీ ఇప్పించడంపైనే దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక భూమికను పోషించిన భాజపా రేపు పార్లమెంటులోనూ అదే కీలక భూమికను పోషించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా ప్యాకేజీపై పట్టుబట్టే అవకాశం ఎక్కు వగా ఉంది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ జిల్లాల్లో యాత్రలు కూడా నిర్వహించారు.
ముఖ్యంగా రాజధాని నిర్మాణం, నీటి పంపకాలు, ఉద్యోగాలు తదితర విషయాలపై తెలంగాణ నేతలను కాదని కేంద్ర పార్టీ వద్ద చర్చలు జరిపారు. ఈ స్థితిలోనే పార్టీ తెలంగాణ, సీమాంధ్ర బిజెపిలుగా విడిపోయి పని చేస్తూ వచ్చారు. తెలంగాణ ప్రాంత కమిటీ పేర ఇక్కడ సమావేశం నిర్వహించగా, సీమాంధ్ర నేతలు కూడా ఆ ప్రాంతంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తమ ఇబ్బందులను చర్చలకు తెచ్చారు. ఇవన్నీ పార్టీ గతంగా కొనసాగినా సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన సమైక్య పోరులో బీజేపీ కార్యాలయాలపై, నాయకులపై దాడులు కొనసాగాయి. అయిన ప్పటికీ తాము చెప్పిన మాటకు కట్టుబడే బీజేపీ తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకెళ్ళింది.
మొత్తంమీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినా సీమాంధ్రకు ప్యాకేజీ, రాజధాని, ఉద్యోగుల విషయాల్లో గట్టి వాదననే ముందుకు తెచ్చింది. పైగా పలు పార్టీలు ఓట్ల కోసమే అన్న చందంగా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసి చివరకు విఫలమై ఆదినుంచి తాము కూడా ఈ పోరాటం కన్నా సీమాంధ్ర అభివృద్ధి తదితర విషయాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదన్న దృష్టికి రావడానికి బీజేపీనే కారణంగా భావించవలసి వస్తుంది. మొత్తంమీద సిడబ్ల్యుసి లో నిర్ణయించి జీవోఎం ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నట్లు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందంటే దీంతో సీమాంధ్రులు ఓడిపోయినట్లు కాదని, వారికి కూడా న్యాయం జరుగుతుందని, రెండు రాష్ట్రాల అభివృద్ధి తమకు ముఖ్యమని ప్రకటించారు. ఇక సీమాంద్ర కోసం ఫ్యాకేజీ మిగిలింది. దీనిపై ఎన్ని యుద్దలు జరుగుతాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more