బాబుకు కేంద్రం మంత్రి చిరంజీవి కౌంటర్ అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మీద కాదులేండి. సమైక్యాంద్ర కోసం 100 రోజులు ఉద్యమం చేసి , అలసి పోయి, అప్పుడప్పుడు .. మీడియా ముందు కనిపిస్తే.. త్వరలో మేము మెరుపు సమ్మె చేస్తాం అని ఉడత ఊపులు ఊపుతున్న ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. కేంద్రం రాష్ట్ర విభజన పై తుపాన్ వేగంతో దూసుకుపోతుంది. అశోక్ బాబు మాత్రం.. మీడియా ముందు .. సీమాంద్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని .. డిమాండ్ చేస్తున్నారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించడాన్ని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి తిప్పి కొట్టారు. తాము రాజీనామాలు చేసింది, లేనిది అందరికి తెలుసునని,తాము చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నామని, సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరామని,అది వీలు కానప్పుడు సీమాంద్ర ప్రయోజనాలను కాపాడుకోవడం ముఖ్యమని చిరంజీవి అన్నారు.
అయిన అశోక్ బాబు చాలా కొత్త గా మాట్లాడుతున్నాడని చిరంజీవి అన్నారు. తాము చిత్తశుద్దితో సమైక్యం కోసం,సీమాంద్ర ప్రయోజనాల కోసం కృషి చేయలేదని అనడం క్షమార్హం కాదని చిరంజీవి స్పష్టం చేశారు.అయినా ఆయన కృషి ఆయన చేయమనండి..మా వంతు మేము చేస్తాం.. అని చిరంజీవి అన్నారు. అందరం కలిసి పనిచేయవలసిన సమయంలో విభేదాలు అనవసరమని ఆయన చెప్పారు.
తెలంగాణను అడ్డుకుని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అన్నది తమ ఉద్దేశం అని..అయితే తెలంగాణను అడ్డుకోలేని ప్రయత్నంలో సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యమని చిరంజీవి గుర్తు చేశారు. అందరం కలిసి పనిచేయాలని, సమైక్యంగా రాష్ట్రం ఉండేలా ప్రయత్నించాలని..కానీ ఇలా వివాదాలు పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మరి చిరంజీవి ప్రశ్నకు అశోక్ బాబు ఏమని సమాధానం ఇస్తారో ? వేచిచూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more