తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పై చర్చలు జరిపేందుకు ఇంక మూడు వారాల గడువు ఇవ్వటానికి రాష్ట్రఫతి ప్రణబ్ ముఖర్జీ సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే అదే బాటలో జీవోఎం కమిటలోని ముగ్గురు మంత్రులు కూడా ఎనిమిది కోట్ల మందికి కూడా ఒకేసారి సమన్యాయం చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కసరత్తును పూర్తి చేశాక మంత్రివర్గ సమావేశానికి ముందు ఈ బిల్లు వస్తుందని, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశానికి ఈ బిల్లు వచ్చే అవకాశాలు లేనందున వీలైనంత త్వరగా ప్రత్యేక కేబినెట్‌ను సమావేశపరచి తద్వారా ఈ ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేయించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలున్నట్టు ప్రచారం జరుగుతోంది.
డిసెంబర్ తొలి వారం తర్వాతే మంత్రివర్గ భేటీ జరిగే అవకాశముందని, ఇదికూడా వాయిదా పడితే లోక్‌సభ సమావేశాల ప్రారంభం తర్వాతే తెలంగాణ బిల్లుకు మోక్షం లభిస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (జీవోఎం) మరో రెండు, మూడు దఫాలు సమావేశమయ్యాకే ముసాయిదా బిల్లుకు తుది రూపమివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందజేయాలని జీవోఎం నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే వారంలో జీవోఎం వరుస భేటీలు నిర్వహించి తద్వారా నివేదికను సిద్ధం చేయాలని ప్రతిపాదించింది.
అయితే ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, ఆస్తులు, అప్పులు, రాజ్యాంగ సవరణలు, 371(డి), న్యాయపరమైన సమస్యలు, నదీజలాలకు సంబంధించిన కీలక అంశాలు రాష్ట్ర విభజనకు పీటముడిగా మారాయి. ఈ చిక్కుముళ్ళు విప్పితే తప్ప విభజనకు సంబంధించిన ప్రక్రియ ముందుకుసాగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీనుంచి లోక్‌సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నందున ఈలోపు మంత్రిమండలికి ముసాయిదా బిల్లు రావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది. కేవలం పన్నెండు రోజులు మాత్రమే లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నందున విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా జీవోఎం సభ్యులకు ఆదేశాలిచ్చింది. మొత్తంగా చూస్తే సోనియా ఉత్తర్వులు అమలయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విభజన అంశాన్ని ఒక రోజులో తేల్చడం కుదరదని, ఎన్నో కీలక అంశాలపై చర్చలు, సంప్రదింపులు చేయవలసి ఉందని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని ఈ ముగ్గురు మంత్రులు తెగేసి చెప్పినట్టు సమాచారం. హోంమంత్రి షిండే అధ్యక్షతన సమావేశమైన మంత్రుల బృందం విభజనపై సుదీర్ఘంగా మంతనాలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. నిన్నమొన్నటిదాకా విభజనకు మొగ్గుచూపిన జీవోఎం సభ్యులు షిండే, జైరాం రమేష్, వీరప్ప మొయిలీలు సమన్యాయం వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more