ఒక యంగ్ కపుల్స్ .. గంట సేపు ముద్దు పెట్టుకుంటే.. ఏం జరుగుతుంది. అని తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే. లేదా ఇప్పుడే తెలుసుకుంటే మాత్రం మీకు ‘‘హార్ట్ ఎటాక్ ’’ రాకుండా చూసుకొనే బాధ్యత మీదే. ఇప్పటి టాలీవుడ్ లో తిక్క తిక్క టైటిళ్లతో .. సినిమా తీసి విజయం సాధించిన దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయనే పూరి జగన్నాథ్. గతంలో పూరి తీసిన సినిమా చూస్తే.. ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, నేనింతే, నేను నా రాక్షాసి, ఇలాంటి సినిమాలు తీసిన ఘనత జగన్ కే దక్కుతుంది. అయితే రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ తో ‘‘హార్ట్ ఎటాక్ ’’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ ఈ రోజు విడుదలైంది. దీని రెస్పాన్స్ చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు.
ఈ మద్య కాలంలో చాలామంది దర్శకులు ఈ మధ్య ఫస్ట్‌లుక్‌ని మేకింగ్ వీడియో రూపంలో విడుదల చేసి సినిమాలపై ఆసక్తి పెంచారు. కానీ పూరి మాత్రం ఎటువంటి హడావోడి లేకుండా తన పాత స్టయిల్లోనే రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో బోలెడన్ని ముద్దు సీన్లున్నాయి నితిన్ ముద్దు సీన్లున్నప్పుడల్లా టైం కి వచ్చేవాడని యూనిట్ మొత్తం అట పట్టించటం... షూటింగ్ మొత్తం ఫన్నీగా జరిగిందని పూరి చెబుతున్నాడు. హీరోయిన్ ఆదాశర్మతో నితిన్ ముద్దు పెట్టే సన్నివేశానికి సంబంధించిన స్టిల్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు... ఓ గంట ముద్దుపెడితే మూడు వేల క్యాలరీలు ఖర్చువుతాయంటూ ఇందులో ఓ క్యాప్షన్ ఇచ్చేశాడు. ఇది అర్థం కాక ముద్దు పెడితే మూడు వేల రూపాయిలా అని నోరు వేలబెడుతున్నారు. నిజంగానే మూడు వేల రూపాయిలు అని పెడదాం అనుకోని...చివరగా ఇలా ఇచ్చాడు ట్విస్ట్.
అయితే పూరి కూడా దీనిపై రకరకాలుగా ఆలోచించుకోమనే ఛాయిస్‌ని కూడా నెటిజన్లకు పూరి వదిలేశాడు. వచ్చే వారంలో టీజర్ రిలీజ్ చేస్తాడట. ఈ జోష్ చూస్తుంటే పూరి హిట్ కొట్టేటట్లున్నాడు. ఇది ఇప్పటికే ఇంటర్నెట్లో భయంకరంగా హాల్ చల్ చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. సొంతబ్యానర్‌పై ‘హార్ట్ ఎటాక్’ని తెరకెక్కిస్తున్న పూరి... ఆడియోని డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more