ఆంధ్ర ప్రదేశ్ రాష్టాన్ని విభజిస్తున్నామని కేంద్రం ప్రకటించి, దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించి విభజన ప్రకియను కీలకద దశకు తీసుకొని వచ్చి తెలంగాణ ముసాయిదా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్దమౌవుతున్న తరుణంలో కేంద్రం పది జిల్లాల తెలంగాణ కాకుండా పన్నెండు జిల్లాల రాయల తెలంగాణ అంశాన్ని కూడా మళ్లీ లేవనెత్తి
దానికి సంబంధించిన సమాచారం, లోటు పాట్ల గురించి ఇంటలీజెన్స్ వర్గాల ద్వారా రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణాలోని టిఆర్ఎస్, భిజేపి, సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలను ఈ విషయంపై ఇంటలిజెన్స్ అధికారులు అడగడం, వారి అభిప్రాయం చెప్పమనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటలిజెన్స్ డిఎస్సీ స్థాయి అధికారులు రెండు మూడు సార్లు కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, మీరు ఒప్పుకుంటారా, తెలంగాణ ప్రజలు దీనిని అంగీకరిస్తారా అంటూ ఆరా తీసారు. కానీ ఇక్కడి అన్ని పార్టీల తెలంగాణ నేతలు ముక్త కంఠంతో పది జిల్లాల తెలంగాణ తప్ప మనేమి అవసరం లేదని చెప్పినట్లు సమాచారం.
అయితే కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఏర్పడే మేజర్ సమస్యలను రాయల తెలంగాణ ద్వారా పరిష్కారం చూపాలని, హైదరాబాద్, శ్రీశైలం వంటి వాటికి పరిష్కారం ఈజీగా దొరుకుతుందని , ఎలాగొలాగో తెలంగాణా అంశాన్ని మద్యే మార్గంగా పరిష్కారం చేయడానికే కేంద్రం రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తోందని, దానికి సంబంధించిన బిల్లును కూడా తయారు చేసిందని, త్వరలో పార్లమెంటులో దానినే పెట్టబోతున్నారని అంటున్నారు. ఇక మొదటి నుండి రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఎంఐఎం కూడా కేంద్రం నిర్ణయానికి సానుకూలంగ ఉంది. కానీ ఆ ఒక్క పార్టీ తప్ప మిగిలిన పార్టీలు రాయల తెలంగాణ కోరుకోవడం లేదు కాబట్టి కేంద్రం గనుక రాయల తెలంగాణ దిశగా అడుగులు వేస్తే మళ్ళీ తెలంగాణలో ఉద్యమం తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more