సినిమా తారలకు సెంటిమెంట్ ఎక్కువ. ఏ రోజు షూటింగ్ ప్రారంభించాలి. ఏ లొకేషన్లో సినిమా ప్రారంభం కావాలి. ఏ హీరోయిన్‌తో జతకడితే బాగుణ్ను. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. ఏ దేవుని చిత్ర పటాలపై మహూర్తపు షాట్ చిత్రీకరించాలి ఇలా బోలెడన్ని సెంటిమెంట్లు మన సినిమా తారలకు ఉంటాయి. తమిళ తారల సెంటిమెంట్ ఏంటో ఒక సారి తెలుసుకుందామా..!
రజనీకాంత్
తన ప్రతి చిత్రం తొలి సన్నివేశంగా ఏవీఎం వినాయక ఆలయం ఎదుట కొబ్బరికాయ కొట్టి, విఘ్నేశ్వరుడికి దణ్ణం పెట్టుకోవడాన్ని రజనీకాంత్ సెంట్‌మెంట్‌గా కొనసాగిస్తున్నాడు. వరుసగా కొన్ని ఫ్లాపులు ఎదురైనప్పుడు ‘అన్నామలై’ ఆయనకు ఘనవిజయాన్ని అందించింది. ఈ చిత్రంలో ఇది తొలి సన్నివేశం కావడంతో నాటి నుంచి ఆ పంథాను కనసాగిస్తున్నారు. ఆ సన్నివేశం సినిమాలో ఉన్నాలేకున్నా... నాటి నుంచి చిత్రీకరణకు మాత్రం అదే తొలి సన్నివేశంగా ఉంటూ వస్తోంది.
విజయకాంత్
గతంలో షూటింగ్‌కి వెళ్ళేటప్పుడే కాదు. ఇప్పుడు రాజకీయా కార్యక్రమాల్లోనూ తన తండ్రి, తల్లి, అన్న ముగ్గురు కలిసివున్న ఫొటోకు దండం పెట్టుకుని, ఆపై పూజగదిలోని దేవునికి నమస్కరించి నుదుటికి విభూది రాసి బయలుదేరుతారు.
ఏఆర్ రెహమాన్
తను అంగీకరించిన కొత్త చిత్రానికి బాణీలు సమకూర్చే ముందుగా మలేషియా సమీపంలోని ఓ దీవికి వెళ్ళటం స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌కు ఉన్న సెంటిమెంట్. అక్కడున్న ఓ సిద్ధుడి జీవసమాధిని ధర్శించిన మీదటే రెహమాన్ కొత్త చిత్రానికి బాణీలు అందించడానికి రెడీ అవుతాడు.
ఇళయరాజా
ప్రతి రోజూ బయటకు వెళ్ళాలన్నా, బాణీలు సమకూర్చేందుకు వెళ్ళినా తల్లి చిత్రపటాన్ని రెండు చేతులతో తాకి, కళ్ళకు అద్దుకుంటే కానీ కాలు తీసి బయట పెట్టరు.
విశాల్
సినిమాకి సంబంధించిన కార్యక్రమాలకు హాజరవ్వాలంటే నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తాడు. ఇందుకోసమే ఆయన 20 జతల నల్ల దుస్తులు తన వాడ్రోబ్లో పెట్టుకున్నాడు.
అనుష్క
తిరుమల వెంకటేశ్వరుడికి వీర భక్తురాలైన అనుష్క షూటింగ్‌కు హాజరయ్యేందుకు ముందుగా ఆయనకు నమస్కరించాల్సిందే. అలాగే ఏ పనిచేయాలన్నా కూడా ముందు వెంకటేశ్వరుడికి దండం పెట్టుకోవడం అనుష్క సెంటిమెంట్.
భావన
ఇష్టదైవం గురువాయురప్ప, కృష్ణుడు నెలకు ఒకసారైనా గురువాయురప్పా ఆలయాన్ని దర్శించుకోవడం, ప్రతి రోజూ ఉదయం కృష్ణుడిని ప్రార్థించిన తర్వాతే దిన చర్య ప్రారంభించడం భావన సెంటిమెంట్.
విజయ్
జూన్ 22న పుట్టిన విజయ్ అదృష్ణట సంఖ్య 4. దీని కారణంగా కారు నెంబరు, తనకు చెందిన ఇతర సంఖ్యలు కూడా 4గా ఉండేలా జాగ్రత్త పడుతాడు. తన చిత్రం విడుదలయ్యే రోజు 4వ తేదీగా ఉంటే అది ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం కూడా విజయ్ అనుసరించే సెంటిమెంట్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more