రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర కోసం అధిష్టానంతో పోరుకు దిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం .. సిఎం కిరణ్ గానీ, ఆయన కుటుంబం గానీ, కాంగ్రెస్ పార్టీకి విదేయులు అంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ రోజు ఢిల్లీ కి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యారు. సీఎం కిరణ్ కూడా తెలంగాణకు అనుకూలమే అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర హీరో అవుతారా? లేక జీరో అవుతారా అని సమైక్యవాదులు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు కూడా కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
మంత్రి టిజి వెంకటేష్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.ముఖ్యమంత్రిని అదిష్టానం తీసివేస్తే సీమాంద్రలో ఆయన హీరో అవుతారని, కిరణ్ తనంత తాను రాజీనామా చేస్తే జీరో అవుతారని ఆయన అన్నారు. మొత్తం మీద ఏదో రూపంలో కిరణ్ పదవి దక్కుతుందని టిజి వెంకటేష్ భావిస్తున్నారా?కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ,నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. సిపిఐ నేత నారాయణ రెండు మూడు రోజులలో కిరణ్ భవితవ్యం తేలుతుందని అంటున్నారు.ఎలా చూసినా, ఎవరి నోట విన్నా కిరణ్ మరికొన్నాళ్లే ముఖ్యమంత్రి అనుకోవాలా. కాకపోతే హీరోనా?జీరోగానా అన్నదే సమస్య .
అమ్మ మాటకు ఎదురు చెప్పాని నాయకుడిగా కేంద్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నల్లారి వారే.. చిత్తూరు నీళ్లు చల్లి, సమైక్య మంటలను ఆర్పేయటం జరిగిందని సమైక్యవాదులు అంటున్నారు. ఇప్పుడు అమ్మ వద్ద మెప్పు పొంది, ప్యాకేజీ తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదని సీమాంద్ర కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more