రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉత్సాహంతో ఢిల్లీకి పరుగు పరుగున వెళ్లి ఏపీ భవన్ లో వారం రోజుల పాటు దీక్ష లో కూర్చోవటం.. పట్టపగలే పోలీసులు బాబు దీక్షను భగ్నం చేయటం, 64 ఏళ్ల వయసులో చేసిన దీక్ష ఫలితంగా.. ఆరోగ్యంలో సునామీ మార్పులు రావటం.. వెంటనే ఆసుపత్రికి చేర్చటం జరిగింది. వెంటనే డాక్టర్లు స్పందించి .. ఆయన లో ఉన్న చక్కెర శాతం తగ్గిపోకుండా.. మెరుగైన వైద్యం అంధించటతో .. బాబు వెంటనే డిశ్చార్జ్ అయి.. ఇంటికి చేరుకున్నారు. ఇంటిలో విశాంత్రి తీసుకున్న చంద్రబాబుకు రాజకీయం నిద్రపోనివ్వటం లేదు.. అందుకే ఈరోజు మళ్లీ ఆయన మీడియా ముందుకు రావటం జరిగింది.
చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ.... కాంగ్రెస్ కుట్రను జాతీయ స్థాయిలో బయట పెట్టేందుకే ఢిల్లీలో ధీక్ష చేపట్టానని చంద్రబాబు చెప్పటం జరిగింది. అయితే దీక్షకు సహకరించిన వారందరికీ ధన్యవాధులు బాబు చెప్పటం జరిగింది. బొగ్గు కుంభకోణం రోజుకో ములుపు తిరుగుతోందని, ప్రధాని సంతకం చేసిన పైళ్లకు దిక్కు లేదంటే దేశం ఎక్కడికెళ్తోందని బాబు ప్రశ్నించారు. నివేదికలో మార్పులు చేశారని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని, అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో నడిచేది యూపీఏ ప్రభుత్వం కాదని, అక్కడ నడిచేది బ్రోకర్ల రాజ్యం అని, ఈ బ్రోకర్ల రాజ్యంలో 15 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ విషయంలో సోనియా స్క్రిప్టును రాష్ట్రానికి పంపే పోస్ట్ మ్యాన్ లా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ పని చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
మేం అధికారంలో ఉన్నప్పుడు పని చేసిన అధికారులు ఉన్నత స్థానాల్లోకి వెళితే....కాంగ్రెస్ అధికారంలో పనిచేసిన అధికారులు జైళ్ళకు వెళ్లారన్నారు. తాము ఎప్పటి నుండో విభజన విషయంలో రెండు ప్రాంతాల నేతలతో మాట్లాడిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పినా వినిపించుకోలేదని, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని విడగొట్టే ప్రయత్నం చేస్తుందని, జగన్, తెరాసలను చూసుకొని కాంగ్రెస్ తన కాళ్ళను తామే నరుక్కుంటుందని, ఈ రెండు పార్టీలు ఒకరినొరకు పొగిడేసుకుంటూ భుజాలు తడుముకుంటుందని ఆయన విమర్శించారు. ఇన్నాళ్ళు ఢిల్లీలో దీక్ష చేసిన బాబు తరువాత ఏం చేయబోతున్నాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more