Shinde secret operation on state bifurcation

Shinde Secret Operation on State Bifurcation, Home Minister Sushilkumar Shinde, ap bifurcation, telangana issue, telangana note,

Shinde Secret Operation on State Bifurcation

షిండే ఆపరేషన్ సీక్రెట్..?

Posted: 10/18/2013 08:34 PM IST
Shinde secret operation on state bifurcation

సమైక్యాంద్ర ఉద్యమం చల్లబడిపోవటంతో.. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. తెలంగాణ జిల్లాల వివరాలను యుద్ధప్రాతిపదికన తయారు చేసి రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు కేంద్రం 13 అంశాలను ఒక ఫార్మాట్‌ రూపంలో వచ్చేలా విషయాలను సేకరిస్తోంది. అయితే ఇది అత్యంత గోప్యంగా, కేవలం టెలిఫోన్ ద్వారా మాత్రమే సేకరిస్తూ సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వివరాలను సేకరిస్తోంది.

 

రాష్ట్ర విభజనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్షేత్రస్థాయి వివరాల సేకరణలో పడింది. రాష్ట్రంలో ఆర్టికల్ 371 క్లాజ్ D అమలుకు సంబంధించిన సమాచారంపై ఆరా తీసింది. వారం రోజుల క్రితమే రాష్ట్ర అధికారులను కేంద్రహోంశాఖ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనాభా, పరిశ్రమలు, నదులు, ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సాగువిస్తీర్ణం, ఉద్యోగుల ఆదాయం, ప్రభుత్వ భూములు, అటవీ భూములు వంటి అంశాలు ఈ ఫార్మాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

దీంతో రాష్ట్ర అధికారులు ఆ వివరాల సేకరణ పనిలో బిజీ అయ్యారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు జారీ చేయలేదు. అంతేకాకుండా రాష్ట్రవిభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి కూడా ఈ విషయం తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత వరకూ అధికారికంగా సమాచారం అందలేదు. హోంశాఖ ఉన్నతాధికారులు మాత్రమే సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

తమకు కావాల్సిన సమాచారాన్ని ఫోన్‌లో చెబుతున్నారు. ఆ మేరకు అధికార యంత్రాంగం నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక రాష్ట్రవిభజన ప్రక్రియను హోంశాఖ తన కన్నుసన్నల్లోనే నడిపిస్తోంది. సాధ్యమైనంతగా వివరాలను గోప్యంగా ఉంచుతోంది. భవిష్యత్‌లో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా అన్ని అంశాలపై దృష్టిపెడుతోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more