హైద్రాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సకలజన భేరీలో ఇంతవరకు నాయకుల అన్న మాటలు ఇవిః
తెలంగాణా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఈ సభను ఇంతవరకు ఎటువంటి ఆంక్షలు, నిషేధాలు జరిగుతున్న మొదటి సభగా పేర్కొన్నారు. ఏపి ఎన్జీవోలు సమ్మె ఎందుకు చేస్తున్నారో వారికే తెలియటం లేదని, వారు దానిమీద శ్వేత పత్రాన్ని విడుదలచెయ్యాలని అన్నారు.
కేవలం హైద్రాబాద్ మీద పెత్తనం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నదని, సామాన్య ప్రజానీకాన్నిరెచ్చగొట్టి హైద్రాబాద్ లో ఆస్తులను సంపాదిస్తున్నారని ఉద్యోగుల ఐకాస చైర్మన్ శ్రీనివాస గౌడ్ అన్నారు. హైద్రాబాద్ లో ఉన్నవారిని తమతో కలుపుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నది ముఖ్యమంత్రేనని, హైద్రాబాద్ మీదనే దృష్టి పెట్టి సమైక్య నాయకులు మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణాకు హైద్రాబాద్ గుండెకాయని తెలంగాణా ఐకాస నాయకుడు గోవర్ధన్ అన్నారు.
తెలంగాణా న్యాయవాదుల ఐకాస నాయకుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణాకు వ్యతిరేకంగా ఉద్యమాలను హైద్రాబాద్ లో అనుమతించబోమని, జై తెలంగాణా అనేవాళ్లే హైద్రాబాద్ లో ఉంటారని ఘాటుగా అన్నారు. సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణా సుదీర్ఘ పోరాట ఫలితమే రాష్ట్ర విభజనకు చేసిన నిర్ణయమని, తెలంగాణా రాష్ట్ర అంతిమ దశకు చేరుకున్నదని అన్న సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, తెలంగాణా ప్రజలది కడుపు కాలిన పోరాటంగా అభివర్ణించారు. ఆంధ్రా లో జరుగుతున్నది మాత్రం అప్రజాస్వామిక పోరాటమని అన్నారాయన.
భాజపా తరఫున సభకు హాజరైన నాగం జనార్దన రెడ్డి తెలంగాణా బిల్లును పార్లమెంటులో రాబోయే శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలని కోరుతూ, భాజపా దానికి పూర్తి సమర్ధన తెలియజేస్తుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వకపోతే భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన ప్రక్రియ పూర్తిచేస్తామని నాగం అన్నారు.
తెలంగాణా ఏర్పాటును ఎవరూ ఆపలేరని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం, రాజధానిగా హైద్రాబాద్ ఏర్పాటు తప్పక అవుతుందని కె కేశవరావు అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more