హైదరాబాద్ లోని నిజాం కాళాశాల ప్రాంగంలో జేఏసీ నిర్వహించిన సకల జనభేరి సభ విజయవంతం అయింది. నిజాం మైదానం నిజంగా జనసాగరమైంది.జనప్రవాహం పొంగిపొరలి... రాజధాని రహదారులపై ప్రవహించింది. కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న సీడబ్య్లూసీలో తెలంగాణ పై తీర్మాణం చేసిన తరువాత జరిగిన మొట్టమొదటి సభ నిజాం కాలేజి గ్రౌండే కాక చుట్టుప్రక్కల కూడ జనసంద్రం అయింది. తెలంగాణలోని 10 జిల్లాల నుండి తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో హైదరాబాద్ కు తరలిరావడంతో హైదరాబాద్ మొత్తం గులాబీమయం అయింది. నిజాం కళాశాల మైదానంలో జరిగిన ఈ సభ కాళోజీ ప్రాంగణంలో, ఆచార్య జయశంకర్ వేదికగా తెలంగాణ వాదులు, నాయకులు మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
ఈ సభలో పలువురు నాయకులు మాట్లాడి తెలంగాణ వాదుల్ని ఉత్సాహ పరిచారు. ముఖ్యంగా కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణల పై, ముఖ్యమంత్రి తీరు పై, సీమాంధ్ర ఉద్యమంలో తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరయ్యాడు. ఈయనే కాకుండా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తెలంగాణలోని పలు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పాల్గొని సభ పై ప్రసంగించి తెలంగాణ ఆకాంక్షను మరోసారి సీమాంధ్రులకు, కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... ‘లక్షమంది కిరణ్‌కుమార్‌డ్డిలు, లక్షమంది జగన్మోహన్‌డ్డిలు, లక్షమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణ వెంట్రుకకూడా పీక్కోలేరు ’ అని తేల్చి చెప్పారు. సంపూర్ణ తెలంగాణ సాధించేవరకూ ఉద్యమ పంథా కొనసాగించాలని సకల తెలంగాణ ఉద్యమ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోయినా ఎన్డీయే మనకు అండగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ కృషి కొనసాగించాలని కోరారు . ఈ సభలో కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ... లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే... సీమాంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే అని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరొచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరు హైదరాబాద్ పై కిరికిరి పెడితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణతో గోక్కున్నవాళ్ళు ఇంత వరకు ముందట పడలే. 2004లో చంద్రబాబు ఆరునెలల్ల ముంచేస్తా అన్నాడు. ఇప్పుడేమైంది ? ఎల్లకిల్ల పడ్డడు. లేచేపరిస్థితే లేదు. తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదని వెకిలి మాటలు మాట్లాడిన వైఎస్ పావురాల గుట్టలో పావురం అయిపోయాడు. కిరణ్ కి ఏదో పోయేకాలం వచ్చినట్లుంది. అక్టోబర్ 6 తరువాత ఊడపీకుతారని, ఇంత జరిగాక ఏ బేవకూఫ్ కలిసి అయినా కలిసి ఉంటాడా ? కలిసి ఉండగలమా ? ప్రస్తుతం కలిసి ఉన్నా మానసికంగా ఎప్పుడో విడిపోయాం అంటూ తనదైన శైలిలో ముఖ్యమంత్రి పై విరుచుకుపడ్డాడు.
ఆంధ్రోళ్లు ఎప్పుడూ ఆంధ్రోళ్లే అని లంకలో పుట్టినవన్నీ రాక్షసులే. ఆంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే. ఆంధ్ర లో ఎవరైనా విజ్ఞానులు అక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు. ? చంద్రబాబు పీ టర్న్ తీసుకున్నా అంటాడు. నీ బతుక్కి ఎన్ని టర్న్‌లు ? వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ప్రజల టర్న్ గుర్తుకు రాలేదా ? ఆంధ్ర ప్రదేశ్ విడిపోతే చంద్రబాబు 5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్నాడు. ఆ ప్యాకేజీ తెలంగాణ కు ఇవ్వాలని అన్నాడు. జగన్ పార్టీ సమన్యాయం అంటోంది. అసలు మాకు న్యాయమే లేదు. ఇంకా సమన్యాయం ఎక్కడిది ? అంటూ కడిగి పారేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమం గురించి మాట్లాడుతూ... ఉద్యమం పేరుతో ఆంధ్రోళ్ళు వేస్తున్న పిచ్చి వేశాలను చూసి నవ్వొస్తుంది. గడ్డి తినడం, కోడి ఈకలు తింటూ... ఆకులు కట్టుకొని పడవల పై వెళ్ళడం... పార్లమెంటు సమావేశాల్లో కొరడాలతో కొట్టుకోవడం కూడా ఉద్యమమేనా... ? ఇదీ ఉద్యమమా ? ఉద్యమ బిడ్డలు సింహాల్లా ఉంటారు. తెలంగాణ ఉద్యమం కోడికూత లాంటిది... తెల్లారిన వెంటనే ఎవ్వరు చెప్పినా చెప్పక పోయినా కోడి కూడినట్లే ఉంటుంది. ఆంధ్రవాళ్ళది అలారం వాచీ ఉద్యమం... ఎవడో వచ్చి కుంజీ ఇస్తేనే అలారం మోగుతుంది. అదో దిక్కుమాలిన ఉద్యమం అంటూ తనదైన శైలిలో ఉద్యమాన్ని విశ్లేశించి సభికుల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఉత్సాహపరిచారు. ఇదే స్పూర్తితో ముందుకుసాగాలంటూ ముగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more