Seemandhra congress mps resign on september 24

Seemandhra Congress MPs resign on September 24, congress high command, digvijaysingh ap congress incharge, seemandhra congress leader meet

Seemandhra Congress MPs resign on September 24, congress high command, digvijaysingh ap congress incharge, seemandhra congress leader meet

తెగించిన రాజకీయనాయకులు

Posted: 09/21/2013 07:11 PM IST
Seemandhra congress mps resign on september 24

గురువారం రాత్రి ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ తో వార్ రూంలో భేటి అయిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు విభజన పై వెనక్కి తగ్గకపోతే రాజీనామా చేస్తామని చెప్పడంతో డిగ్గీ రాజాకు ఎక్కడో కాలడంతో ఆయన అంతెత్తు లేచి , పోతే పోండి.... మా నిర్ణయాన్ని మార్చుకోం అని గట్టిగ హెచ్చరించడంతో సీమాంధ్ర ప్రాంత ఎంపీ కిక్కుమనకుండా బయటకు వచ్చినట్లు ఢిల్లీ వర్గాల నుండి సమాచారం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలతో హర్ట్ అయ్యిన వారు రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 7 ఎమ్.పిలు ఈనెల 24వ తేదీన రాజీనామా చేయాలని, తమ రాజీనామా పత్రాలను స్పీకర్ మీరాకుమార్ కు సమర్పించి, ఎలాగైనా రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. వీరిలో లగడపాటి, ఉండవల్లి, రాయపాటి, సాయిప్రతాప్, అనంత వెంకటరామిరెడ్డి ఎస్పీవైరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలు ఉన్నారు. అయితే కేంద్ర మంత్రులు మాత్రం తెలంగాణ క్యాబినెట్ నోట్ వచ్చాక రాజీనామా చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

మరో వైపు తెలంగాణ ప్రాంతానికి 13 మంది తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఏ క్షణం అయినా కాంగ్రెస్ లో చేరవచ్చని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ హైదరాబాద్ లో వెల్లడించారు. ఆ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామన్నారు. అందుకోసం రేపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా న్యూఢిల్లీ వెళ్తున్నట్లు భిక్షమయ్య గౌడ్ వివరించారు. అయితే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఒప్పుకునేది లేదని భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చానంటున్న చెప్పుకుంటున్న బాబు పెద్ద దొంగ అని ఆయన అభివర్ణించారు. ఆయనకు నిజంగా సమాచారం ఉందో, లేదో, మైండ్ గేమో తెలియదు కాని ఈయన వ్యాక్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more