Infertility rate among indian couples on the rise says survey

Infertility Rate among Indian Couples on the Rise Says Survey, infertility rate among Indian couple, Infertility rises at alarming pace in India

Infertility Rate among Indian Couples on the Rise Says Survey

పెళ్లికానీ ప్రసాద్ లకు బ్యాడ్ న్యూస్ ?

Posted: 09/21/2013 02:57 PM IST
Infertility rate among indian couples on the rise says survey

పెళ్లికానీ ప్రసాద్ లకు ఒక బ్యాడ్ న్యూస్. మీరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే.. మాత్రం ఇక అంతే సంగతి. అచ్చటా ముచ్చటా జరగాల్సిన సమయంలోనే జరిగితే ఎటువంటి సమస్యలుండవని, ఆలస్యమైతే సంతానలేమి సమస్యతో బాధపడాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘హెల్పింగ్ ఫ్యామిలీస్’అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశంలోని తొమ్మిది నగరాల్లో 100 మంది సంతాన సాఫల్య నిపుణులతోపాటు 2,562 మందిని ప్రశ్నించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. శృంగార సామర్థ్యం తక్కువ నుంచి అతి తక్కువగా ఉన్నవారిలో 46 శాతం మంది 31 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నవారేనని తేలింది. వీరిలో 63 శాతం మంది శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. వీరిలో ఈ సమస్య తలెత్తడానికి సంతాన సాఫల్య వైద్య నిపుణులు అనేక కారణాలను వెల్లడిస్తున్నారు. జీవన విధానంలో మార్పులు చోటుచేసుకోవడం, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో ఇటువంటి సమస్య తలెత్తే అవకాశం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం ద్వారా సదరు యువతీయువకులు మానసిక ఒత్తిడికి గురవడంతోపాటు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశముందని, ఇది వారిలో శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇవేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శృంగారంపట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు కూడా ఈ సమస్యను మరింత ఎక్కువగా చేస్తున్నాయంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more