భాయ్ చిత్రం విడుదలకు తయారుగా ఉందని అక్కినేని నాగార్జున ఈరోజు మీడియాకు తెలియజేసారు. ఆ చిత్రంలో కథానాయకుడి పాత్రలో నటిస్తున్న నాగార్జున ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్న మాటే. ఈ చిత్రానికి వీరభద్రం చౌధరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో రిచా గంగోపాధ్యాయ నాగ్ సరసన నటిస్తోంది. ఇందులో ప్రత్యేకమైన పాత్రలలో కామ్నా జేఠ్ మలానీ, నథాలియా కౌర్, జరా షా, హంస నందినీలు కనిపించబోతున్నారు. సోనూ సూద్ దుష్టపాత్రలో నాగార్జునతో పోరాట దృశ్యాలలో అలరించబోతున్నారు.
భాయ్ తో పాటు నాగార్జున మనం ఊసులు కూడా చెప్పారు. అందులో అక్కినేని త్రయం మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. అయితే మూడు తరాల వాళ్ళుగా కనిపిస్తారని అందరూ ఊహించిన దానికి భిన్నంగా రెండు తరాల కథ అవుతోంది. అంటే నాగార్జున, నాగచైతన్య అన్నదమ్ములన్నమాట. ఇష్క్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకత్వాన్ని చేపట్టారు. ఈ చిత్రం శరవేగంతో చిత్రీకరణ చేసుకుంటున్నదని నాగార్జున చెప్పారు.
అంతేకాదు, నాగార్జున సారధ్యంలో నడుస్తున్న అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మీడియాలో సుశిక్షితులైన ముగ్గురు యువకులు కూడా ఈ సినిమాలో రంగప్రవేశం చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత నాగార్జున.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విడుదల చెయ్యటానికి జంకుతున్న పెద్ద సినిమా నిర్మాతలు చేసే ప్రకటనల వలన చిత్ర విశేషాలు అందరికీ తెలియటంతో పాటుగా ఆ నిర్మాతలు కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని సాహసంతో ఒక్కో అడుగూ ముందుకెయ్యటానికి పనికివస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more