రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కు తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఎంపిక విషయంలో ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తామంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. దీంతో పదేళ్ళ తర్వాతైనా సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పాటు చేయడం అనివార్యం అని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరికి తోచిన రీతిలో వారు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన జరిగితే రాజధాని ప్రాంతం కోసం మూడు ప్రాంతాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య, ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతాన్ని, విశాఖపట్టణంలలో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖకు చెందిన ఒక బృందం ఈ ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అనువుగా ఉండేలా రాజధానిని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆయా ప్రాంతాలలో ఉన్న వనరులను కూడా పరిశీలిస్తున్నారు. మంచి నీరు అందుబాటు, విస్తీర్ణం, విస్తరణకు అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత తదితర అంశాలను కేంద్రం పరిశీలి స్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మూడు ప్రాంతాలకు చెందిన నాయకులు ఎవరికి వారు అధిష్ఠానం వద్ద పలుకుబడిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావును కూడా కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలను కలుపుతూ రాజధానిని ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని ఆ కేంద్ర మంత్రి భావిస్తూ ప్రయత్నాలను చకచకా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో కరడుగట్టిన సమైక్యవాదిగా పేరొందిన ప్రస్తుత కేంద్రమంత్రి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ప్రకటించాక కొంత మెత్తబడ్డారు. ఈ విషయంలో ఆ మంత్రి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.అనంతరం సీమాంధ్రలో ఉధృతమైన ఉద్యమ నేపథ్యం లో తాను సమైక్యవాదిననే ప్రకటించుకున్నారు. అయినా కేంద్ర పెద్దలతో నిత్యం సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఈ మంత్రి విభజన ఖాయమని దాదాపుగా ఒక నిర్ణయానికి రావడమే కాకుండా రాజధాని ఎంపిక విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విజయవాడ రాజధాని అయితే పక్క జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ ప్రాంతానికి కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెరాస అధినేత కెసిఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంలో కెసిఆర్‌ను రహస్యంగా ఆ మంత్రి కలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
విభజన అంశంలో కెసిఆర్ మాటకు అధిష్ఠానం విలువ ఇస్తుండడంతో రాజధాని ఏర్పాటు విషయంలో తమ ప్రతిపాదనకు అధిష్ఠానం అంగీకరించేలా ప్రయత్నించాలని ఆ కేంద్రమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇందుకు కెసిఆర్ కూడా కొంత సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో విశాఖ ముందుకు దూసుకుపోతుందని, ఐటి రంగం కూడా ఇక్కడ అభివృద్ధయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని, ఒక నివేదికను కూడా తయారుచేసి అధిష్ఠానానికి అందజేసినట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయని, రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు విశాఖకు ఉన్నందున దీన్నే ముఖ్య పట్టణంగా చేయాలని ఈ వర్గం ప్రయత్నం చేస్తోంది. రాయలసీమకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ప్రకాశం జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేయాలని కూడా పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాయలసీమ ముఖ్యనేతలు కూడా ప్రకాశం జిల్లాలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more