Security for charan movie

security for Charan movie, Zanjeer, Thoofan movie, Attharintiki Daaredhi movie, Ramayya Vasthavayya, Samaikyandhra, Telangana movement

security for Charan movie

రామ్ చరణ్ జంజీర్ తుఫాన్ లకు భద్రత

Posted: 09/05/2013 11:21 AM IST
Security for charan movie

రామ్ చరణ్ తేజ నటించిన జంజీర్, తుఫాన్ హిందీ తెలుగు చిత్రాలను రేపు రాష్ట్రంలో విడుదల చేస్తున్న సందర్భంగా వాటికి భద్రత కల్పించవలసిందిగా కోరుతూ ఆ సినిమాల నిర్మాణ సంస్థ రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ వారు హైకోర్టుని ఆశ్రయించారు. 

కేంద్ర మంత్రి చిరంజీవి బాహాటంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచినందువలన తెలంగాణా ప్రాంతంలోనూ, రాజీనామా చెయ్యటంలేదని, విభజనను ఆపలేదని సీమాంధ్రలో వ్యతిరేక భావాలుండటం వలన ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను విడుదల చెయ్యటానికి 40 రోజులుగా నిర్మాతలు జంకుతున్నారు. 

అయితే జంజీర్ హిందీలోనూ, తుఫాన్ తెలుగులోను నిర్మించిన రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ వారు 6 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలోనూ చెయ్యక తప్పదు.  అందువలన ఆ సినిమాలు ప్రదర్శిచే చోట భద్రతా ఏర్పాట్లను చెయ్యాలంటూ నిర్మాతలు హైకోర్ట్ ని ఆశ్రయించటం జరిగింది.

విడుదలకు క్యూ కట్టటానికి తయారుగా ఉన్న పెద్ద చిత్రాలు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, రామ్ చరణ్ ఎవడు, జూనియర్ ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా, వెంకటేష్ రామ్ ల మసాలా.  జంజీర్ వలన విడుదలకు దారేమైనా ఏర్పడుతుందేమోనని పెద్ద సినిమాలతో పాటు వాటి మీద ఆధారపడ్డ చిన్న సినిమా నిర్మాతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

జంజీర్, తుఫాన్ చిత్రాలు ప్రదర్శిస్తున్న థియేటర్లకు భద్రత కల్పించవలసిందిగా హైకోర్ట్ నుండి ఈరోజు డిజిపి కి ఆదేశాలు అందాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more