ఇప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు ఆ ఇద్దరు నాయకుల కోసం ఎదురుచూస్తున్నారు. పవర్ పుల్ నాయకులు ఆ ఇద్దరేనని తెలుగు ప్రజలు అంటున్నారు. ఆ ఇద్దరులో ఒకరు.. తెలుగు వాడి సత్తా ఏమిటో జాతీయ పార్టీలకు, ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామరావు. ఎన్టీఆర్ పేరు పలకని, మనిషి ఈ భూమి పైన లేడు. ముఖ్యంగా తెలుగు జాతి ప్రజలు నిత్యం ఎన్టీఆర్ ను తలచుకునే ఉంటారు. తెలుగు జాతికి వన్నెతెచ్చిన మహా నాయకుడిగా, తెలుగువారికి ఆత్మబంధవైన అన్నగా నిలిచిపోయిన గొప్ప మనిషి ఎన్టీఆర్ గారు. ఆయన తెలుగు ప్రజల ప్రేమను పొందటానికి ఉద్యమాలు చెయ్యలేదు, రాజకీయాలు చెయ్యలేదు. ఎన్టీఆర్ చేసింది ఒక్కటే సాటి మనిషిని గౌరవించటం, చిన్న, పెద్ద అని తెడా లేకుండా అంత తెలుగు బిడ్డలే అని చూడటం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ఆయన నీతి నిజాయితీలే ఎన్టీఆర్ ను దేవున్ని చేశాయి. తెలుగు ప్రజలకు కనిపించే దేవుడిగా ఎన్టీఆర్ అవతరించాడు. ప్రతి మనిషిలోను కొన్ని మైనస్ లు ఉంటాయి. అయితే ఆయా పరిస్థితులను బట్టి కొన్నింటికి ఎన్టీఆర్ లోనైన విషయం తెలుగు వారికి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వ్యక్తిగతంగా ఎవ్వరికి శత్రువు కాదనే విషయం, ఆయన రాజకీయ శత్రువులకు బాగా తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉంటే.. తెలుగు ప్రజలు రెండుగా విడిపోయేవారా? ఆంద్రప్రదేశ్ ను రెండుగా విడదీసే శక్తి ఏ రాజకీయ పార్టీకి ఉండేది కాదని .. ఆంద్రపదేశ్ లోని ప్రతి తెలుగువారి ప్రతి గుండె అంటుంది.
ఇక మరో నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ పేరును ప్రతి రాజకీయ నాయకుడు వాడుకుంటున్నారు. వైఎస్ రెండు స్లారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నోరుమేదపని చోటా, బడా నాయకులు ఆయన మరణించిన తరువాత నోర్లు తెరిచి గోల చేస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, పదవుల కోసం, కాసుల కోసం, బెండైన మన బడా రాజకీయలు నాయకులు, నీతినీయమాలు మరిచి మీడియా ముందు నిలబడి , వైఎస్ పై నిందలు వేస్తున్నారు. అసలు తప్పాంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అనే చెప్పే నాయకులు, ఆ రోజ చీరలు కట్టుకొని ఉన్నారా, లేక గాజులు తొడుక్కొని ఉన్నారా అనే అనుమానం ప్రతి తెలుగువారికి వస్తుంది. ఇప్పుడు చెప్పేదే.. అప్పుడే వైఎస్ ను ఎదిరించి అడిగితే ఇంత దూరం వచ్చేది కాదనే విషయం మరిచిపోయి, ఇప్పుడు మీడియా ముందు నిలబడి ఏదో సాధించినట్లుగా గొప్పలు చెప్పుకోవటం చాలా దారుణమని తెలుగు ప్రజలు అంటున్నారు. అంటే అప్పుడు వైఎస్ ను అడిగే దమ్ము, దైర్యం ఏ రాజకీయ నాయకుడు లేదని, ఇప్పటి రాజకీయ నాయకులు బహిరంగంగా చెప్పుకోవటం చాలా విశేషం. అప్పడేమో నోట్లో అల్లం పెట్టుకొని, ఇప్పుడు బెల్లం తిన్న మాటలను ప్రజలకు వినిపించటం, సిగ్గుగా లేదా అని రాజకీయ మేథావులు అడుగుతున్నారు. రెండు సార్లు ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఘనత వైఎస్ దే అని చెప్పిన నాయకులే.. ఈ రోజు తెలంగాణ ఏర్పాటుకు కారణం వైఎసే అని చెప్పటం చాలా దారుణమని వైఎస్ అభిమానులు అంటున్నారు. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఈరోజు ఇన్నీ గొంతులు అరిచేవా? కాంగ్రెస్ నాయకులకు ఇన్ని కొమ్మలు వచ్చేవా? ఆంద్రప్రదేశ్ విడగొట్టే దమ్ము, దైర్యం, సాహసం, ఇటలీ బుల్లెమ్మకు ఉండేదా? పవర్ పుల్ నాయకుడు కాబట్టే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు అనే నిజాని కాంగ్రెస్ నాయకులు మరిచిపోయి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు బతికున్న నాయకుల మీద తెలుగు ప్రజలకు నమ్మకం పోయింది. పదవుల కోసం, కాసులు పాకులాడే రాజకీయ నాయకల మీద నమ్మకం లేదని తెలుగు ప్రజలు అంటున్నారు. అందుకే తెలుగు ప్రజలు ఆ ఇద్దరి నాయకులను గుర్తు చేస్తుకుంటున్నారు. ఢిల్లీ నాయకులు కూడా ఎన్టీఆర్ , వైఎస్ఆర్ గురించే మాట్లాడుకుంటన్నారు. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం కొన్ని నిజాలను బయట పెట్టారు. 2004లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్నారమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. ప్రధాని హామీనే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో రాష్ట్ర ప్రజలకు తెలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పవర్‌ఫుల్ సీఎం వైఎస్‌ఆర్ అని జైపాల్‌రెడ్డి అన్నారు. ఇలాంటి పవర్ పుల్ రాజకీయ నాయకులు మనకు మళ్లీ ఎప్పుడు వస్తారో అని తెలుగు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more