తెలంగాణ రాములమ్మగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సమితి అద్యక్షడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెల్లెలు మెదక్ జిల్లా ఎంపీ అయిన విజయశాంతి ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి చేరుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేసిఆర్ (అన్న) పై మౌన యద్దం ప్రకటించి, ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన శిష్యుల చేత అన్న పార్టీపైనే సిబిఐ ఎంక్వకైరీ చెయ్యాలని మీడియా ముందు హల్ చల్ చేసిన రఘనందనరావుకు అండగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజగా .. రాములమ్మ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అన్ని సిద్దచేసుకున్నట్లు సమాచారం. హస్తంలోకి అడుగుపెట్టాడనికి ముహూర్తం కూడా పెట్టినట్లు సమాచారం. ఆగష్టు 8వ తేదిన కాంగ్రెస్ కండువ కప్పుకోవటానికి విజయశాంతి ఇప్పటి నుంచి రెఢీ అవుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. గతంలో రాములమ్మకు పెద్దపువ్వు (కమలం) గుర్తు వాళ్లు గాలం వేయటంతో అందరికి ఆమె పెద్దపువ్వులో కలిసిపోతుందని అనుకున్నారు. కానీ ఇటీవల సీఎం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన దగ్గర నుండి రాములమ్మ మనసు హస్తంపైకి మళ్లీ నట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవటం, ఇక తెలంగాణ వస్తుంది కాబట్టి , అన్న పార్టీలో ఉంటే పాన్ ఖర్చులకు కూడా పైసాల్ దొరకవనే విషయం రాములమ్మ త్వరగా గ్రహించి, హస్తం వారికి రాములమ్మ చెయ్యి అందించటానికి సిద్దమైనట్లు సమాచారం. మళ్లీ మెదక్ జిల్లా సీటు దక్కించుకోవాలంటే.. రాములమ్మ కాంగ్రెస్ లోకి కలిసిపోవటమే మంచిదని విజయశాంతి సన్నిహితుల సలహాల మేరకే కాంగ్రెస్ లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. రాములమ్మ వల్ల కాంగ్రెస్ ఎంత లాభం ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more