Two movies of cherry in two weeks

Ramcharan Tej yevadu release, Ramcharan Tej Janjeer release, Yevadu movie release, Janjeer movie release, Priyanka Chopra, Shruti Haasan, Amy Jackson, Allu Arju, Amitabh bacchan

two movies of cherry in two weeks

రామ్ చరణ్ డబల్ ధమాకా

Posted: 07/30/2013 05:34 PM IST
Two movies of cherry in two weeks

రామ్ చరణ్ తేజ్ నటించిన ఎవడు సినిమా నిజానికి రేపు విడుదల కావలసింది.  కారణమేదైనా నిర్మాత దిల్ రాజు చొరవ తీసుకుని విడుదలను ఆగస్ట్ 21కి వాయిదా వెయ్యటం కాస్త అభిమానులకు చివుక్కుమన్నా, ఈ రోజు సాయంత్రం ఎప్పటి నుంచే నానుతున్న తెలంగాణా వివాదానికి తెరదించుతామంటూ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించి ఏక బిగిన యుపిఏ, సిడబ్లుసి సమావేశాలను నిర్వహించి ఈ రోజే తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పటంతో సినిమా రంగంలో కూడా సంచలనం మొదలైంది.  ఏ నిర్ణయం వలన ఏ ప్రాంతంలో ఎలాంటి అవాంతరం ఏర్పడుతుందో అని అందరూ భయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో ఎవడు సినిమా వాయిదా పడటం చాలా మంచిదైందని అభిమానులలో నిరుత్సాహం స్థానంలో మరోసారి ఉత్సాహం చోటుచేసుకుంది. 

ఆ తర్వాత మరో రెండు వారాల్లో విడుదల అవుతోంది.  ఆ సినిమాల విడుదలలో జాప్యముండదని దర్శకుడు స్వయంగా చెప్పి, ఆ సినిమా విడుదల అవుతుందో లేదో అనే కు తావులేకుండా చేసారు. 

వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఎవడు చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా శ్రుతి హాసన్ నటించగా మరింత ఉర్రూతలూగించేందుకు అమి జాక్సన్ తన వంతు శృంగారాన్ని కొంచెం అతిగానే అందించినట్లుగానూ సమాచారం.  ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చెయ్యటం, అల్లు అర్జున్ అతిథి పాత్రలో అలరించటం కూడా జరిగింది. 

ఇక జంజీర్ లో హిందీ తార ప్రియాంకా చోప్రా తెలుగులో కూడా శృంగారాన్ని పండించింది.  అదే తెలుగు భాషలోకి అనువదించి విడుదల చేస్తుండటం వలన ప్రియాంకాకు ఇది మొదటి తెలుగు సినిమా అవుతుంది.  ఒరిజినల్ జంజీర్ లో అమితాభ్ బచ్చన్ వేసిన పాత్రను రామ్ చరణ్, జయ భాదురి వేసిన పాత్రను ప్రియాంక ధరించారు.

ఇక ఈ డబల్ డబల్ ధమాకాల కోసం రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూడటం మొదలుపెట్టారు.  ఆగస్ట్ 21, సెప్టెంబర్ లను తమ డైరీల్లో రాసుకుని ఆ రోజుల్లో ఇతర కార్యక్రమాలేమీ లేకుండా చేసుకుంటామంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more