భారతరత్నను వెనక్కివ్వాలని బీజేపీ ఎంపీ చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలపై ఆర్థికవేత్త అమర్త్యసేన్ స్పందించారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి తనను భారతరత్న తిరిగివ్వాలని కోరితే ఇచ్చేందుకు సిద్ధమేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో ఎవరు తనకు భారతరత్న ఇచ్చారో చందన్ మిత్రాకు తెలియకపోవచ్చని, వాజ్‌పేయి తనకు అవార్డును అందజేశారని సేన్ అన్నారు. వాజ్‌పేయి తనకిచ్చిన అవార్డును తిరిగివ్వమంటే ఇచ్చేందుకే సిద్ధమని సేన్ పేర్కొన్నారు. ఇలాంటి డిమాండ్ రావడం దురదృష్టకరమని, ఇది మిత్రా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కోరుకోవడం లేదని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. సేన్ వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ ఎంపీ చందన్ మిత్రా చేసిన విమర్శలు కూడా తీవ్ర దుమారాన్నే లేపాయి. సేన్‌కు ఇచ్చిన 'భారతరత్న'ను వెనక్కివ్వాలంటూ మిత్రా వ్యాఖ్యలు చేయగా, తనకేమీ తెలియనట్లుగా బీజేపీ మౌనంగా వహించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఘాటుగా స్పందించింది. ప్రతిపక్ష బీజేపీ తీరు నియంతృత్వ ధోరణిలా కనిపిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛను బీజేపీ నేతలు నమ్ముతున్నారా? అని అనుమానం కలుగుతుందని, ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి మనీష్ తివారీ మండిపడ్డారు. అమర్త్య సేన్ చేసిన తప్పేంటని, ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసినందుకే 'భారత రత్న'ను వెనక్కివ్వాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more