కాంగ్రెస్ పార్టీలో చాలా నుండి ఉంటూ కాకా గా పేరు మోసిన జి. వెంకటస్వామి కొడుకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు అయిన జి. వివేక్ తెలంగాణ అంశం పేరుతో కాంగ్రెస్ అధిష్టానం పై యుద్దాలు చేసి చివరకు అలసి పోయి అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ఆలోచనే లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడి.. పార్టీకి గుడ్‌బై కొట్టి, గులాబి జెండా కప్పుకొన్న ఎంపీ వివేక్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు సమాచారం. కారెక్కి కనీసం రెండు నెలలు కూడా కాకముందే అంబాసిడర్ ‘కారు ’ పై మోజు తీరిందో ఏమో కానీ ఆయన మళ్లీ తన పాత గూటికే కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో వేగంగా ముందడగు వేస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ.. ఇప్పుడు మళ్లీ వివేక్‌ను సొంతింటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు అంత్యంత విశ్వసనీయం సమాచారం. ఇక కేకే, మందా జగన్నాథం, కే. కేశవరావులు ఉన్నప్పుడు తెలంగాణ అంశం పై ఎన్నిసార్లు మాట్లాడినా స్పందన రాకపోవడం, అటు అధిష్టానం నుండి కూడా ఎలాంటి సంకేతాలు లేకపోవడం అదే టైంలో ఉద్యమం చల్లబడటంతో వీరు ముగ్గురు భవిష్యత్ ప్రణాళికలో భాగంగా టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ సాధించిన క్రిడిట్ దక్కించుకుందామని కారెక్కారు. కానీ అక్కడ కేశవరావుకు తప్ప మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదు. ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా టీఆర్ఎస్ నాయకుడిగా మాత్రం గుర్తించడం లేదు. ఇక ఉద్యమం పేరుతో వారానికి రెండు సార్లు అయినా కనిపించే వివేక్ ఇప్పుడు టీవీలో కనిపించడమే లేదు. అంతేకాకుండా వీరు పార్టీ నుండి బయటకు వెళ్లిన తరువాత కాంగ్రెస్ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ, మంత్రుల సబ్ కమిటీ అని తెలంగాణ అంశం పై స్పందిస్తూ, త్వరలో తెలంగాణ ప్రకటన వస్తుందనే ప్రచారం రావడంతో వివేక్ మళ్లీ తన సొంత గూటికే వస్తేనే బాగుంటుందని భావించినట్లు వార్తలు.
తాజాగా ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే ను కలిసి తెలంగాణ అంశం పై చర్చించారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడే అవకాశాలు ఎంతో కొంత కనిపిస్తున్నాయనే నమ్మకం పలువురు నేతల్లో కలగడంతో వివేక్ కారు దిగి హస్తం పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఈయన కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీలోకి మళ్లీ వస్తానని కూడా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితో ఏదో ఒరుగుతుందని అనుకున్న వివేక్ అక్కడ ఏ విషయం లేకపోయే సరికి మళ్లీ పాత పార్టీలోకి వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పై కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం వెల్లడించే నాటికి చేతి నుండి వెళ్లి కారెక్కిన వారు మళ్లీ దిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more