శ్రుతి హాసన్ కి ఏ సమస్యా లేదు, ప్రేక్షకులకూ ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ శ్రుతిహాసన్ డబల్ రోల్ వలన వాళ్ళ సినిమాలు నష్టపోతాయేమోనని నిర్మాతలు మాత్రం ఆదుర్దా పడుతున్నారు!
నిజంగా ఒకే సినిమాలో డబల్ రోల్ కాదు. నిఖిల్ అద్వానీ నిర్మిస్తున్న డి డే సినిమాలో వేశ్య పాత్రలో కనిపించే శ్రుతి హాసన్ ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రామయ్య వస్తావయ్య సినిమాలో నిండుగా గబ్బర్ సింగ్ లో భాగ్యలక్ష్మిలా కనిపిస్తుంది. రెండు సినిమాలూ ఒకేసారి విడుదల అవుతుండటం వలన నిర్మాత నిఖిల్ అద్వానీ ఈ పరస్పర వ్యతిరేకమైన పాత్రలను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారా అని గాభరా పడుతున్నారు.
ఇరువైపులా ఒకేలా చెప్తున్నారు- వాళ్ళు వేరే రోజు విడుదల చేస్తారని అనుకున్నా కానీ అదే రోజు విడుదల అవుతున్నాయని తెలిసి కాంటాక్ట్ చేద్దామంటే వాళ్ళు దొరకలేదు. ఫోన్లంతే మరి. రెండువైపుల నుంచీ డయల్ చేస్తుంటే ఎవరికీ అవతలివారి ఫోన్ దొరకదు. కాంటాక్ట్ చెయ్యాలంటే చాలా పద్ధతులున్నై కానీ ఎవరికివారు తగ్గదలచుకోలేదని అర్థమౌతోంది.
అయితే నిఖిల్ అద్వానీ మాత్రం తనకు తాను నచ్చచెప్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. "ప్రేక్షకులు చాలా తెలివైనవారు. వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. కోషిష్ సినిమాలో జయ భాదురి సంజీవ్ కుమార్ భార్యగా వేసింది. మరి అదే జంట వెనువెంటనే వచ్చిన పరిచయ్ లో తండ్రీ కూతుళ్ళుగా నటించలే! ప్రేక్షకులు రెండిటినీ ఆదరించారు!" అని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more