మాజీ మేయర్ బండ కార్తీక ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా బండ కార్తీక హైదరాబాద్ నగర్ మేయర్ గా రెండున్నర సంవత్సరం సేవాలు అందించారు. బండ కార్తీక కు సికింద్రబాద్ ఎమ్మెల్యే నటి , జయసుధల మద్య వివాదాలు తారస్థాయిలో జరిగి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు పంచాయితీ రావటం , ఇద్దరికి ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ మేయర్ గా బండ కార్తీక నగరంలో అక్కడక్కడ హల్ చల్ చేస్తుంది. లాలాపేట లోని పోచమ్మ గుడి స్ధలం విషయంలో వివాదం చెలరేగడంతో హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లాలపేటలోని పోచమ్మ గుడికి రెండువైపుల ప్రవేశానికి గేట్లు ఉండగా ఇటీవలే ఒక గేటును మూసివేశారు. కాగా ఈ రోజు ఉదయం ఆ గేటును ఎందుకు తొలగించారంటూ టిడిపి, వైసిపి నేతలు కాంగ్రెస్ నేతలతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మాజీ మేయర్ కార్తీక రెడ్డి అక్కడకు చేరుకొని వాస్తు కారణంగానే ఆ గేటును మూసివేశామని చెప్పే ప్రయత్నం చేయగా స్ధానిక నేతలు నినాదాలు చేశారు. దీంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని పరిస్ధితి ఉద్రిక్తంగా మారిన దృష్యా బండా కార్తీక రెడ్డితో పాటు పలు పార్టీలకు చెందిన నేతలను అరెస్టుచేసి స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వివాదం పై కొత్త విమర్శలు వినిపిస్తున్నాయి. బండాకార్తీక తన ఇమేజ్ పెంచుకోవటానికి పొచమ్మ గుడి వివాదం తెరపైకి తెచ్చిందని స్థానికులు అంటున్నారు. పొచమ్మ గుడిని కూడా బండా కార్తీక రాజకీయం చేయటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more