Political seemandhra congress party leaders plan a new

seemandhra congress party leaders plan a new, samkyandhra, telangana issue, telangana state, minister sailajanadh, minister tg venkatesh, congress party, sonia gandhi,

seemandhra congress party leaders plan a new

సీమాంధ్ర నేతల ఓటు..?

Posted: 06/29/2013 10:22 AM IST
Political seemandhra congress party leaders plan a new

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎన్ని ప్రయత్నాలు అవసరమైతే అన్నీ చేస్తామని సీమాంధ్ర నేతలు స్పష్టం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలు విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ... ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని తాము అధిష్టానాన్ని కోరతామన్నారు. ఇప్పటి వరకూ విభజనపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమేనన్నారు. జూలై 1న మరోసారి సమావేశమవుతామని, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను సైతం ఆహ్వానిస్తామన్నారు. టిజి వెంకటేష్ మాట్లాడుతూ...తెలంగాణకు అనుకూలంగా వచ్చిన 'డిసెంబర్ 9' ప్రకటనను సైతం చర్చల ప్రక్రియగా మార్చామని, తెలంగాణ ఏర్పాటుకు అధిష్టానం సమ్మతిస్తే.. మరోసారి అదేవిధంగా వ్యవహరిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర అవసరాన్ని వివరిస్తూ అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న 'తెలంగాణ సభ'పై మీడియా ప్రశ్నించగా... తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడి ప్రజల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని, తాము సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా మాట్లాడతామని చెప్పారు. ఇది ఎంతకాలమైనా సాగొచ్చని అన్నారు. తమ లక్ష్యం సమైక్యాంధ్రేనని, తెలంగాణ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి జరిగిన తర్వాత విడిపోతామంటే ఒప్పుకునేది లేదని టిజి అన్నారు. మొత్తం మీద సీమాంద్ర నేతల ఓటు సమైక్యంగానే ఉందని అర్థమవుతుంది. అయితే కావూరి చేసిన విమర్శలే సమైక్యంద్రలో సెగలు రేపుతుంది. ఓటు రాజకీయ కోసం సీమాంద్ర నేతలు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more