Actor akkineni nageswarao rao devadasu completes 60 years

anr-devadas-movie-completes-60-years, devadasu completes 60 years, devadasu telugu movie completes 60 years, devadasu telugu movie completes 60 years photos, anr devadas movie completes 60 years, devasadu, akkineni nageswara rao, savithri, breaking news, film news, movie reviews, telugu movies

actor akkineni Nageswarao rao devadasu completes 60 years

దేవదాసు షష్టి పూర్తి చేసుకున్నాడు.

Posted: 06/26/2013 12:14 PM IST
Actor akkineni nageswarao rao devadasu completes 60 years

ప్రముఖ నవలా రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ బెంగాల్‌లో వున్న తాగుడు వ్యసనం, ఆ వ్యసనం వలన దెబ్బతిన్న అనేకమందితోపాటు తన మిత్రుడుని కూడా చూసి చలించి రాసిన నవల అన్ని భాషలవారినీ అలరించింది. దేవదాసుని నిర్మించాలని ప్లాన్‌ చేసినపుడు, అక్కినేనిని ఆ పాత్రకు ఎంపిక చేసినపుడు నిర్మాత డి.ఎల్‌.నారాయణని అందరూ భయపెడితే, ఒకసారి వాయిదా వేసి, మనసు అంగీకంరించక సహ నిర్మాతలు తప్పుకున్నా తనే నిర్మాతగా రూపొందించారు. దేవదాసు చిత్రం ఎన్ని భాషల్లో వచ్చినా అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' భారతీయ చిత్రరంగంలో అద్భుతమైన ఖ్యాతి సంపాదించుకుంది. వినోదా పిక్చర్స్‌ పతాకాన డి.ఎల్‌.నారాయణ తెలుగు, తమిళ భాషల్లో 'దేవదాసు' చిత్రనిర్మాణాన్ని వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 24-11-1951న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి ఎనిమిది గంటలకుషూటింగ్‌ ప్రారంభించి 26.6.1953న తెలుగు వెర్షన్‌ని 11.9.53న తమిళ వెర్షన్‌ని విడుదల చేసారు.

రెండు భాషల్లో అద్భుతమైన వసూళ్లు తెచ్చింది. అలా విడుదలైన 'దేవదాసు'కి నేడు షష్ఠి పూర్తి సంవత్సరం. బాల్యం నుంచే స్నేహితురాలిని పైకి వుడికిస్తూ, లోపలి ప్రేమిస్తూ, తన ప్రేమను చెప్పుకోలేని స్థితిలో పెద్దవాడై, తరువాత కులాలు అంతస్థులు తేడాతో స్నేహితురాలు కుటుంబాన్ని తన జమీందార్‌ తండ్రి అవమానిస్తే, వారు ఆమెను వేరే వ్యక్తిని పెళ్ళి చేయడంతో బాధను దిగమింగుకోలేక స్నేహితుని వలన తాగుడుకు అలవాటుపడి, సానికొంపకు చేరి, ఆమె ద్వారా అభిమానాన్ని పొందుతున్నా స్నేహితురాలిని వదలలేక, తాగుడుతో జీవితాన్ని పాడుచేసుకుని, స్నేహితురాలి బంగ్లాముందు దిక్కులేనివిధంగా మరణించడం, అది తెలిసి, అతడిని చూడనీకుండా ఆమె అత్తింటివారు తలుపు బలవంతంగా వేస్తే అది తగిలి ఆమె మరణించడం ఈ చిత్ర ఇతివృత్తం.

చక్కగా అర్థం అయ్యేలా తేలికపాటి సంభాషణలు, వేదాంతం కూడా జోడించి అందరినోట పలికేలా పదాలను కూర్చి రాసిన పాటలు, అందుకు తగ్గట్టుగా అందించిన సంగీతం, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి చక్కని హంగులయ్యాయి. పాటలు, మాటలు సముద్రాల (మల్లాది రామకృష్ణ శాస్త్రి ఘోస్ట్‌), సంగీతం సుబ్బురామన్‌, ఛాయాగ్రహణం బి.ఎస్‌.రంగా సమకూర్చారు. దేవదాసు పాత్రకు అక్కినేని సరిపోడు అనే మాటను అబద్ధం చేయడానికి అక్కినేని ఎంతో కష్టపడి ఆ పాత్రను పోషించగా, మేకప్‌, ఛాయాగ్రహణం, పాటలు, సంగీతం, దర్శకత్వం, ఆయన నటనకు బలం చేకూర్చాయి. దేవదాసు పాత్ర పోషణలో మందుకు అలవాటు పడక మీగడ పెరుగుకి బానిసై ఆ మత్తుని మందు మత్తు అనిపించేలా చూపారు అక్కినేని. రెండు వెర్షన్లలో నటించడం అందుకు పాత్రపరంగా సిగరెట్టు కాల్చడం, ఖరీదైన ఆ సిగరెట్టు అయిపోతున్న పారేయలేక పోవడంతో ధూమపానంకి మాత్రం బాగా అలవాటుపడ్డారు ఆ రోజుల్లో అక్కినేని.

పార్వతిగా భానుమతిని అనుకున్నా ఆమె అంగీకరించని కారణంగా సావిత్రికి కైవసమై ఆ పాత్రకు జీవం పోసింది. అక్కినేని స్నేహితునిగా పేకేటి, చంద్రముఖిగా లలిత అక్కినేని తండ్రిగా ఎస్‌.వి.రంగారావు, అన్నగా ఆర్‌.నాగేశ్వరరావు, పార్వతి భర్తగా సి.ఎస్‌.ఆర్‌, పార్వతి బామ్మగా సురభి కమలాభాయి ఇలా అందరు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. జగమే మా య బ్రతుకే మాయ..., చెలియ లేదు చెలిమి లేదు... అంతా భ్రాంతియేనా... కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌... తానే మారెనా జగమే మారెనా... పల్లెకు పోదాం పారును చూద్దాం... కల యిదని నిజమిదని... ఓ దేవదా చదువు ఇదేనా... పాటలు వాటిలోని సాహిత్యం, సమకూర్చిన సంగీతం నేటికీ ఆదరణ పొందుతూనే వున్నాయి. దేవదాసు తొలుత 7 కేంద్రాలలో, కాస్త ఆలస్యంగా విడుదలై 5 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో 175 రోజులు, విశాఖపట్నం లక్ష్మిలో 20 వారాలపాటు ఆడింది. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ తీసిన దేవదాసుకు పోటీగా 6-12-1974లో విడుదల చేసినపుడు విజయం సాధించింది. హైదరాబాద్‌లోనే కేవలం మార్నింగ్‌ షోలతో ఏడాదిపాటు ఆడి మార్నింగ్‌ షోలకే 2 లక్షల 25 వేలు ఆర్జించింది. అక్కినేని నటించిన సినిమాల్లో 'దేవదాసు'కి అప్పుడూ ఇప్పుడూ ప్రత్యేక స్థానమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more