Premarital relation deemed as marriage

premarital relation deemed marriage, Chennai High Court, Justice Karnan, poonam pandey, legal couple, divorce, proof of love making to register marriage

premarital relation deemed as marriage

తాళికాదు, తంతు కాదు వివాహాన్ని నిర్ణయించేది

Posted: 06/21/2013 03:52 PM IST
Premarital relation deemed as marriage

న్యాయస్థానాలంటే అత్యంత గౌరవాన్ని ప్రదర్శించే మన దేశంలో బహుశా ఇదే మొదటి సారనుకుంటా ఇలా ఒక కోర్టు నిర్ణయాన్నిదేశమంతా నవ్వులాటగా తీసుకోవటం. 

లైంగిక సంబంధం వివాహబంధమంత పటిష్టమైనదని చెన్నై హైకోర్టు చెప్పటం మీద పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేసారు.  అయితే నాకు పెళ్ళైపోయిందోచ్ అంది నటి పూనమ్ పాండే ట్విట్టర్లో.  అంటే ఆ ముచ్చట్లన్నీ తీరిపోయాయని చెప్పేసింది సగర్వంగా.  

పెళ్ళి చెప్పకుండా చేసుకుంటున్నాం రిసెప్షన్ అందరితో కలిసి చేసుకుందాం అనే వ్యాపార ప్రకటనలోలాగా, ఒకవేళ మేజర్లైన ఆడ, మగ లైంగిక సంబంధంకాని పెట్టుకున్న తర్వాత ఇక చాల్లే వద్దనుకుంటే కోర్టులో విడాకులు తీసుకోవలసిందే.  పెళ్ళి పదిమందిలో చేసుకోవటమనేది అందరికీ తెలియటానికి చేసే ఒక తంతు మాత్రమే, నిజమైన పెళ్ళి శోభనమే అంటోంది కోర్టు.  

అన్నిటికంటే ముఖ్యంగా ఆ జంట చట్టపరంగా వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చట. అయితే అందుకు వారు కోర్టులో వారు భౌతికంగా ప్రేమను పంచుకున్న దాఖలాలు సమర్పించాల్సివుంటుందట.  న్యాయపరంగా దంపతులకు ఉంటే సర్వ హక్కులూ వీరికీ ఉంటాయంటోంది కోర్టు.  

అసలీ రకమైన తీర్పు వెలువడటానికి కారణం ఒక మహిళ కోర్టులో మెయింటెనెన్స్ కోసం వేసిన పిటిషన్.  పెళ్ళై ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఆ మహిళకు మెయింటెనెన్స ఇవ్వకుండా వదిలేసిన ప్రబుద్ధుని విషయంలో, పెళ్ళి జరిగిందనటానికి సాక్ష్యాధారాలు లేకపోయినా వారి మధ్య వైవాహిక సంబంధం ఉండటం వలన అది వివాహం కిందికే వస్తుందని కోర్టు తీర్మానించింది.  జస్టిస్ కర్ననం ఇచ్చిన తీర్పు ప్రకారం వివాహం జరిగిందనే సాక్ష్యం కన్నా వాళ్ళు దంపతులుగా కలిసున్నారన్నదే వారు వివాహితులనటానికి అసలు ఆధారమవుతుంది.  ఒకే కప్పుకుంద ఉంటూ ఇద్దరు పిల్లలను కన్న తర్వాత పెళ్ళి కాలేదంటే ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు జస్టిస్ కర్నన్.

ఈ తీర్పుతో ఆమెకు వివాహిత హోదాయే కాకుండా నెలకి రూ.500.00 మనోవర్తి కూడా లభించింది. 

ఈ కేసులో తీర్పుతో తంతు పెళ్ళి కాదనే కోర్టు వాదనతో సినిమాల్లోని తాళి సెంటిమెంట్ సీన్లు కూడా మారిపోవచ్చు.  బలవంతంగా తాళి కడుతుంటే హీరోయిన్ తలని పక్కకి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యటం, తాళి విసిరేస్తే వెళ్ళి హీరోయిన్ మెడలో పడితే హతాశులవటం, తాళి పట్టుకుని విలన్ పరిగెట్టుకుంటూ వస్తుంటే హీరోయిన్ ఇంకా వేగంగా పరిగెత్తటం, లేదా హీరో ఏ కత్తినో మరో వస్తువునో విసిరి తాళి హీరోయిన్ మెడలో పడకుండా చెయ్యటం లాంటి సన్నివేశాలకు ఇక స్వస్తి పలకవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh