Movie news ravi tejas balupu movie in controversy

ravi teja, balupu movie in controvers, balupu movie gets caught in controversy just before release, telugu films, brahmin communities, ravi teja, brahmana seva sangha samakhya , brahmin community, gopichand malineni, ravi teja, sruthi hassan and anjali, brahmanandam, avs, balupu release june 28th, balupu movie review, breaking news, film news, movie reviews, telugu movies

Ravi Tejas Balupu Movie In Controversy

రవితేజ ‘బలుపు ’ బ్రహ్మనందం పై రగిలిన బ్రాహ్మణ మంటలు?

Posted: 06/20/2013 07:50 PM IST
Movie news ravi tejas balupu movie in controversy

తెలుగు సినిమాల్లో వివాదం లేకుండా వచ్చే సినిమాలు చాలా తక్కువుగా ఉన్నాయి. ఏ సినిమా తీసుకున్నా ఏముంది చెప్పండి? ఏదో ఒక వివాదంలో చిక్కుకొని, రీల్ నలిగిపోతుంది. ఇక నలిగిపోయిన రీల్ ను ఎవరు చూస్తారు చెప్పండి.? నిజంగా టాలీవుడ్ జరుగుతున్న తంతు ఇదే. గతంలో ఎన్నడు లేని విధంగా.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల పై ప్రజలు తిరగబడుతున్నారు. గతంలో మంచు వారికి తగిలిన దెబ్బే ఈ రోజు హీరో రవితేజు తగిలే పరిస్థితి వచ్చిందని సినిజనాలు అంటున్నారు. ‘బలుపు ’ సినిమా పై బ్రాహ్మణులు కన్నెర్ర చేశారు. ‘దేనికైనా రెడీ' చిత్రంలో కొన్ని సీన్లు తమను అవమానించే విధంగా, కించపరిచే విధంగా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆ మధ్య చేసిన ఆందోళన ఏరేంజికి చేరిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా విడదులైన ‘బలుపు' ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు, సీన్లు తమను కించ పరిచే విధంగా ఉన్నాయని, బ్రాహ్మణులను అవమానించే రీతిలో ఉన్న సన్నివేశాలను తొలగించాలని, ఆ తర్వాతే ఆ చిత్రానికి సర్ట్ఫికెట్‌ను జారీ చేయాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రీజనల్ సెన్సార్‌బోర్డు, ఫిల్మ్ చాంబర్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమాఖ్య కార్యదర్శి పి.చంద్రశేఖర్, యూత్ విభాగం ప్రెసిడెంట్ ద్రోణంరాజు రవికుమార్‌లు ఇరు సంస్థలకు అందజేసిన ఫిర్యాదు కాపీలను పత్రికలకు విడుదల చేశారు.

ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపర్చేవిధంగా ఉన్న కొన్ని సన్నివేశాలు యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆ చిత్రం ట్రైలర్స్‌లో ఉన్నాయని వారు తెలిపారు. వీటిని ఇప్పటికే 2,89,095 మంది వీక్షించారని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు సర్ట్ఫికెట్ జారీ చేయకుండా బ్రాహ్మణ సంఘాల పెద్దలకు ఒకసారి ఈ చిత్రాన్ని చూపించిన తర్వాతే జారీ చేయాలని, బ్రాహ్మణులను అవమానించే రీతిలోఉన్న మాటలు, సన్నివేశాలను తొలగించాలని, అటువంటి వాటిని వెంటనే యూట్యూబ్, టివి ట్రైలర్స్‌లో ప్రసారం కాకుండా నిలిపివేసే విధంగా దర్శక, నిర్మాతను ఆదేశించాలని వారు కోరారు.

ఈ అంశంపై సరైన చర్య తీసుకునే వరకు చిత్రం విడుదలకు అనుమతివ్వరాదని కోరారు. అయితే హీరో రవితేజ బలుపు పై బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేయటం మొదటి సారి.. కానీ కామెడీ నటుడు బ్రహ్మనందానికి ఇదే రెండోసారి, అయితే బ్రాహ్మణులు ఈసారి బ్రహ్మనందం పై కోపం గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అదర్స్ ’ సినిమాలో బ్రహ్మనందం చేసిన క్యారెక్టర్ ను, దేనికైన రెడ్డీ మంచు విష్ణుతో చేసిన క్యారెక్టర్, రీసెంట్ గా బలుపు సినిమాలో బ్రహ్మనందం బలుపు ఏమిటో చూపించాడని, అసలు బ్రహ్మనందం బలుపు పై దెబ్బకొడితే.. మరోసారి ఇలాంటి క్యారెక్టర్స్ లోనటించకుండా ఉంటాడనే ఉద్దేశం తో బ్రహ్మనందంపై చర్యలు తీసుకోవటానికి బ్రాహ్మణుల సంఘాలు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh