Chalo assembly telangana live updates

chalo assembly live updates, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

Chalo Assembly Telangana-Live Updates

చలో అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ?

Posted: 06/14/2013 01:01 PM IST
Chalo assembly telangana live updates

తెలంగాణ ప్రజలు ‘చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయంవంతం చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఇంక జరుగుతునే ఉంది. చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌తో హైదరాబాద్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీకి వెళ్లే దారులతోపాటు మిగతా ప్రాంతాలకు వెళ్లే దారులను కూడా మూసివేయటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చలో అసంబ్లీ పేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత రాత్రి 11 గంటలనుంచి పలు ప్లైఓవర్‌లను మూసివేశారు. అసెంబ్లీ వైపు వచ్చే అన్ని దారులన్నీ బంద్‌ అయ్యాయి. జంట కమీషనరేట్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించారు.

ఆ బంద్ తో మాకు సంబంధం లేదు?

టీఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు ఏకపక్షంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీతో సంప్రదించిన తర్వాతే చెబుతాం బంద్ కు మద్దతుపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని బీజేపీ తెలిపింది. సమిష్టి కృషి వల్లే 'చలో అసెంబ్లీ' కార్యక్రమం విజయవంతమైందని వేణుగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

సిఎంకు ముచ్చెమటలు

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో సహా అధికార కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టించామని తెలంగాణ జేఏసి నేతలు అంటున్నారు. ఛలో అసెంబ్లీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా ఎక్కడిక్కడ ఆందోళనలు చేయడం ద్వారా తలపెట్టిన కార్యక్రమం సఫలమైందని నేతలు పేర్కొన్నారు. మరోవైపు శాసనసభ రెండోసారి వాయిదా పడగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, కావేటి సమ్మయ్య భద్రతా సిబ్బంది వెన్నులో వణుకుపుట్టించారు. వారు అసెంబ్లీ ప్రాంగణంలోని తమ లెజిస్టేచర్‌ పార్టీ భవనంపైకి ఎక్కి తెలిపిన వినూత్న నిరసన అందరి దృష్టినీ ఆకర్శించింది. మార్సల్స్ వారిని అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు

దాడి సిగ్గుచేటు....

గోల్కొండ పోలీస్‌స్టేషన్ వద్ద జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గు చేటు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మీడియాపై దాడిని ఆయన ఖండించారు. జర్నలిస్టుల కెమెరాలు లాక్కొవడం సరికాదన్నారు. రాష్ట్రంలో పోలీసులు, మిలటరీ పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. శాసనసభలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

సీఎం పగ

తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తున్నది అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రజలు తన వద్దకు వస్తానంటే దొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడిలో నైతికంగా విజయం సాధించామని చెప్పారు.

కవిత -విజయశాంతి అరెస్ట్ ?

మెదక్ టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పీఎస్ కు తరలించారు. అయితే ఆమె అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలుకవితను మూడుసార్లు పోలీసులు అరెస్ట్ చేసినా ఆమె తప్పించుకున్నారు.

ఆత్మహత్య యత్నం

మిర్యాలగూడలో యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఛలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులకు మనస్తాపం చెంది ఆ యువకుడు ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది.

విద్యార్థి పరిస్థితి ప్రమాదకరం

చలో అసెంబ్లీ సందర్భంగా గాయపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఉద్యమకారులపై పోలీసులు ప్రయోగించిన భాష్పవాయు గోళాలకు ఒక విద్యార్థికి తలకు గాయం కాగా... మరో విద్యార్థికి మెడపై గాయమైంది. వారిలో మెడకు గాయమైన కృష్ణనాయక్‌ అనే తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థి అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు గాంధీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తలకు గాయమైన దయాకర్‌ అనే ఉస్మానియా పీహెచ్‌డీ స్కాలర్‌ విశ్వవిద్యాలంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగం వల్ల పలువురు మహిళా విద్యార్థినిలు వాంతులు చేసుకుని.. వారిలో స్పృహ తప్పారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థుల రాళ్ల వర్షం 

ఉస్మానియా యూనివర్శిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఇందిరా పార్క్ నుంచి చలో అసెంబ్లీకి తరలి వస్తున్న టీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో స్పృహ తప్పిపోయిన టీఆర్ఎస్ నేత శ్రవణ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సీఎం సభపతి బయటకు వెళ్లారు

అసెంబ్లీ గేట్ 1 వద్ద తెరాస, అసెంబ్లీ 2 గేట్ వద్ద సిపిఐ, బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో కిరణ్, సభాపతిలు మరో గేటు ద్వారా బయటకు వెళ్లారు. మరోవైపు రోడ్డుపై పడుకొని వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కాంగ్రెసు పార్టీదే అన్నారు

విజయవంతం చేస్తాం

ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఇంత స్థాయిలో భద్రత చేపట్టడం సరిహద్దును తలపిస్తోందన్నారు. భద్రతా ఏర్పాట్లును చూస్తుంటే ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

వాయిదాల పర్వం

తెలంగాణ అంశం అసెంబ్లీని కుదిపేస్తోంది. అయిదో రోజు కూడా శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే టిఆర్‌ఎస్‌, తెలంగాణ టిడిపి సభ్యుల నినాదాల మధ్య సభ రెండుసార్లు అరగంట వాయిదా పడింది.టిఆర్‌ఎస్‌ సభ్యులు, తెలంగాణ టిడిపి సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. పార్లెమెంటులో తెలంగాణ తీర్మానం చేసే అంశంపై చర్చ జరగాలంటూ తెలంగాణ టిడిపి సభ్యులు ఫ్లకార్డులు పట్టుకొని పోడియం దగ్గరకు రావడం విశేషం.మొత్తం మీద ఐదో రోజు కూడా... శాసనసభవ్యవహారాల సలహాసంఘం సమావేశంలో నిర్ణయించిన అజెండా అమలయ్యే పరిస్థితులు లేవు. తెలంగాణ తీర్మానం అంశంపై చర్చకు టిఆర్‌ఎస్‌, బిజెపి, సిపిఐ పార్టీల సభ్యులు పట్టుపడుతుండడంతో వారిని సస్పెండ్‌ చేసి సభను నడపాల్సి వుంది. అయితే దీనికి అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం టిడిపి సుముఖంగా లేవు. ఇక ఈ రోజు వాయిదా తీర్మానాలకు వస్తే ఐకెపి ఉద్యోగుల సమస్యలపై వైఎస్‌ఆర్‌సిపి.... తెలంగాణ తీర్మానం, తెలంగాణవాదుల అరెస్టులపై టిఆర్ఎస్‌....తెలంగాణ తీర్మానంపై సిపిఎం, సిపిఐ, బిజెపి వాయిదా తీర్మానాలిచ్చాయి.

అసెంబ్లీ సాగనివ్వం...

తెలంగాణపై తీర్మానం చేసేంత వరకు అసెంబ్లీ సాగనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక్కడ స్పష్టం చేశారు. 'ఛలో అసెంబ్లీ'ని చేపట్టిన తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ వారి పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను వెంటనే వదిలిపెట్టాలని జైపాల్ యాదవ్ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నారాయణ మండిపాటు

రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ సర్కారీ గూండాలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యాయలంలో శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్బంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను నారాయణ తీవ్రంగా ఖండించారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి కార్యకర్తలను గాయపర్చారని, పోలీసుల చర్యలు సహించరానివని నారాయణ అన్నారు.

పలువురు నేతలు అరెస్ట్

చలో అసెంబ్లీ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ సహా పలువురు నేతలను జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాగా రామాంతపూర్లో బీజేపీ నేతలు ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్, హనుమంతరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు నిజామాబాద్ మండలం మాచారెడ్డి మండలం పాల్వంచలో 30మంది తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

రూట్‌లు మార్చిన ఆర్టీసీ

చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రూట్లను ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్లే బస్సులను దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ మీదగా మళ్లిస్తుండగా, వరంగల్ వైపు వెళ్లే బస్సులను దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఉప్పల్ మీదగా మళ్లిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే జిల్లాల నుంచి వచ్చే వారిని పోలీసులు అనుమతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more