‘‘నీది తెనాలి.. నాది తెనాలి అనే ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుందో ’’ వెండి తెరమీద స్పష్టంగా చూపించారు మన సినిమా నటుడు ఏవీఎస్ గారు. అయితే ఇప్పుడు ఆయన నిజ జీవితంలో కూడా అదే సూత్రం పాటిస్తున్నారు. అంటే వెండితెరపై కనిపించినట్లు కాదులేండి. ఇక్కడ ఏవీఎస్ గారు చాలా తెలివిగా .. తెనాలి పై మనసు పడ్డారు. ఏవీవిస్ తెలివిగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు ఒక సందేశం పంపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సినీ నటుడు, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏవీఎస్ చెప్పారు. తెనాలిలో తెలివిగా మీడియాతో చెప్పటం జరిగింది. అంటే ఆయన ఎంపీ సీటు గానీ, ఎమ్మెల్యే సీటుగానీ చంద్రబాబును కోరుతున్నారు.
కానీ చంద్రబాబు ఒప్పుకుంటేనే అని చిన్న కండిషన్ పెట్టారు. అసలే చంద్రబాబుకు, కుటుంబ సమస్యలు, పార్టీ సమస్యలు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సినీ నటుడు ఏవీఎస్ చేసిన వ్యాఖ్యలపై బాబు ఆలోచనల్లో పడ్డారు. పార్టీ నాయకులు ఈ విషయం ఆలోచిస్తున్నారు.. అయితే టిడిపిలో ఇప్పుటికే సినీ గ్లామర్ మెండుగానే ఉంది. కానీ వారి పై రాష్ట్ర ప్రజలు అనేక విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బాబు మోహన్ పై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సర్థిచెప్పుకోలేక సతమతమువుతున్నారు. ఇటీవల కాలంలో సినీ నటులు పదవులకే పరిమితం అవుతున్నారు . కానీ ప్రజా సేవాకు పనికిరారు అనే విమర్శలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. టిడిపి ఇప్పటికే సినీ కామెడీ నటుడు డాక్టర్ అలీ పై కచ్చీఫ్ వేసినట్లు రాజకీయ పుకార్లు వినిపిస్తున్నాయి.
సినీ నటుడు ఏవీఎస్ ను ఎన్నికల్లో నిలబడితే పార్టీకి ఎలాంటి లాభం ఉంటుంది. ఆయనకు ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా. ప్రజలు ఏవీఎస్ కు ఓట్లు వేస్తారా? అనే వాటి పై టిడిపి సీనియర్ నాయకులు పరిశీలస్తున్నారు . ముఖ్యంగా రాబోయో ఎన్నికల్లో పోటీగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ ను తట్టుకొనే సత్తా ఏవీఎస్ లో ఉందా? అనే కోణంలో ఆలోచనాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని బాలయ్యకు అప్పగించినట్లు సమాచారం. ఏవీఎస్ కోరిక తీరుతుందో లేదో రాబోయే ఎన్నికల్లో చూడాలి . టి. సుబ్బిరామిరెడ్డి విశాఖ ను కోరుకోవటం అనేది ఎంత సత్యమో, ఏవీఎస్ కూడా తెనాలి పై మనస్సుపడిని మాట అంతే సత్యం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more